సునీల్ గట్టిగానే ఫిక్సయ్యాడు

సునీల్ గట్టిగానే ఫిక్సయ్యాడు

కమెడియన్ గా స్టార్ స్టేటస్ తెచ్చుకుని తరవాత హీరోగా టర్న్ అయ్యాడు సునీల్. డ్యాన్సులు.. ఫైట్లు కూడా చేసి ప్రేక్షలకును బాగానే మెప్పించాడు. దాంతో మొదట్లో సునీల్ కు మంచి హిట్లే పడ్డాయి. తరవాత వచ్చిన సినిమాల్లో వేటిలోనూ స్టోరీల్లో కొత్తదనం లేకపోవడంతో అవన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఎన్ని దండయాత్రలు చేసినా కమర్షియల్ హిట్ అందని ద్రాక్ష అయిపోవడంతో చివరకు మళ్లీ క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అయ్యాడు.

తనకు బెస్ట్ ఫ్రెండ్ అయిన రవితేజ మూవీ అమర్ అక్బర్ అంటోని సినిమాకు ఫస్ట్ సునీల్ ఓకే చెప్పాడు. తాజాగా శర్వానంద్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. అందాల రాక్షసి ఫేం డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న పడిపడి లేచే మనసులో సునీల్ యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కథాపరంగా కీలకమైన పాత్ర కావడంతో సునీల్ ఈ రోల్ చేసేందుకు ముందుకొచ్చాడట. రేపోమాపో సెట్లో కూడా అడుగుపెట్టనున్నాడు.

సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారదామని చాలా రోజులుగా అనుకుంటున్నా హీరోగా ఆఫర్లు వస్తుండటంతో అలాగే కంటిన్యూ అయ్యాడు. చివరగా వచ్చిన 2 కంట్రీస్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మళయాళంలో సూపర్ హిట్టయిన ఆ మూవీ ఇక్కడ ఏ మాత్రం వర్కవుటవలేదు. దాంతో పద్ధతి మార్చాలని గట్టిగా ఫిక్సయి క్యారెక్టర్ ఆర్టిస్టు గా కనిపించడానికి రెడీ అయ్యాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు