మనల్ని వదిలి పోలేనంటున్న భామ

మనల్ని వదిలి పోలేనంటున్న భామ

టాలీవుడ్ లో హీరోయిన్ గా కుదురుకుంటే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే ఎవరో కొందరు మినహాయిస్తే.. మిగిలిన భామలు టాలీవుడ్ అవకాశాలను వెతుక్కుంటూ వస్తుంటారు. మరికొందరి కోసమే మన మేకర్స్.. వెయిట్ చేసి మరీ తెచ్చుకుంటూ ఉంటారు. ఎలా వచ్చినా కానీ.. 3 ఏళ్ల క్రితమే టాలీవుడ్ లోకి వచ్చింది బెంగాలీ భామ త్రిధా చౌదరి.

సూర్య వర్సెస్ సూర్య అంటూ నిఖిల్ సిద్ధార్ధ్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు.. ఆ తర్వాతి అవకాశం అందుకునేందుకు కొంత సమయం పట్టింది. రీసెంట్ గా మనసుకు నచ్చింది అంటూ తెలుగు ఆడియన్స్ ను మెప్పించేందుకు గట్టిగానే ప్రయత్నించింది. సినిమా కంటే కూడా ఈమె యాక్టింగ్ కు జనాలు బాగానే ఇంప్రెస్ అయ్యారు. అయితే.. అవకాశాలు అందడానికి ట్యాలెంట్ ఒక్కటే సరిపోదు కదా.. అందుకే తనకు ఛాన్సులు ఎందుకు రావడం లేదనే విషయంపై గట్టిగా పరిశోధించిన ఈ బ్యూటీ.. లేటెస్ట్ ట్రిక్కును పసిగట్టేసింది.

ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేయడం షురు చేసింది త్రిధా చౌదరి. ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయిందని చెప్పాలి. ఇప్పుడీమె కోసం తెగ గాలించేస్తున్నారు మేకర్స్. హవీష్ హీరోగా నిన్ను వదిలి నేను పోలేనులే అనే చిత్రానికి సైన్ చేసింది త్రిధా చౌదరి. ఆమె గత సినిమాలలో నటనను చూసి ఇంప్రెస్ అయ్యానని చెబుతున్న దర్శకుడు నిజార్ షఫీ.. ఈ చిత్రంలో హీరోయిన్ క్యారెక్టర్ కు ఆమె సరిగ్గా సూట్ అవుతుందని అంటున్నాడు.