425 మిలియన్ వ్యూస్.. ఇండియాలో ఇదే రికార్డ్

425 మిలియన్ వ్యూస్.. ఇండియాలో ఇదే రికార్డ్

ఇప్పుడున్న యంగ్ హీరోల్లో రణవీర్ సింగ్ క్రేజ్ వేరు అని ఒప్పుకోవాల్సిందే. యూత్ లో ఫుల్లు క్రేజ్ ఉన్న రణవీర్.. పలు రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. వీటిలో యూట్యూబ్ లో హైయెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ రికార్డ్ కూడా కొంత కాలంగా రణవీర్ దగ్గరే ఉంది.

రణవీర్ సింగ్-వాణి కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ మూవీ బేఫికర్ లోని నషే సే ఛడ్ గయీ పాటకు 423 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఇంత పెద్ద రికార్డును బ్రేక్ చేయడం అంటే అమ్మో అసాధ్యం అనిపించవచ్చు. కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ మాత్రం ఈజీగా ఈ ఫీట్ ను సాధించేశాడు. సల్మాన్- కత్రినా జంటగా నటించిన టైగర్ జిందా హై మూవీలోని స్వాగ్ సే స్వాగత్ సాంగ్.. 425మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఘనతను సొంతం చేసుకుంది. అంటే.. అధికారికంగా ఇప్పుడు హైయెస్ట్ వ్యూస్ కలిగిన బాలీవుడ్ సాంగ్ గా స్వాగ్ సే స్వాగత్ నిలిచింది.

ఈ పాటకు ఇంతగా రెస్పాన్స్ రావడానికి సల్మాన్ ఖాన్ క్రేజ్ తో పాటు.. కత్రినాతో కుదిరిన కెమిస్ట్రీ.. ఇద్దరూ కలిసి స్టెప్స్ వేసిన వైనం.. తేలికగా గుర్తిండిపోయే లిరిక్.. ఆకట్టుకునే సంగీతం కారణాలుగా చెప్పవచ్చు. అలాగే పాట కోసం కత్రినా చిందించిన అందాలు కూడా ఒక రేంజులో ఉన్నాయిలే. ఈ రికార్డుతో.. బాలీవుడ్ లో తన రేంజ్ అండ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటాయో అని చెప్పకనే చెప్పాడు సల్లూ భాయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English