మళ్లీ అదే మెగా హీరోతో అనుపమ

మళ్లీ అదే మెగా హీరోతో అనుపమ

ఒక సినిమా హిట్ అయ్యాక.. కాంబోలు రిపీట్ కావడం కనిపిస్తూనే ఉంటుంది. అయితే.. అసలు ఇంకా ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో జనాలకు తెలియకుండానే.. మళ్లీ ఓ జంట కలిసి నటించేందుకు సై అనడం నిజంగా ఆసక్తి కలిగించే విషయమే.

ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరం తేజ్ - అనుపమా పరమేశ్వరన్ కలిసి నటిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్యూ. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు రాగా.. త్వరలో ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇప్పుడీ జంట మరో సినిమాలో కలిసి నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అగ్రిమెంట్ పనులు కూడా ప్రారంభమయ్యాయట. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ సూపర్బ్ గా ఉంటుందట. ఈ విషయం ఇంకా మనకు తెలియదు కానీ.. మేకర్స్ కు అవగాహన ఉంటుంది కదా. దర్శకుడు కిషోర్ తిరుమల రీసెంట్ గా.. సాయి ధరం తేజ్- అనుపమ కాంబినేషన్ లో మూవీ తీసే విషయమై వీరిని సంప్రదించాడట.

ఈ రొమాంటిక్ స్టోరీలో తమ క్యారెక్టర్లను విన్న తేజు అండ్ అనుపమ.. వెంటనే ఈ ప్రాజెక్టుకు సైన్ చేసినట్లుగా చెబుతున్నారు. క్యారెక్టర్లు చాలా కొత్తగా ఉంటాయని.. రీసెంట్ గా వీరిద్దరూ కలిసి నటించారనే విషయం గుర్తుకే రానంత కొత్తగా ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా.. మరో పాత్రకు హలో బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ను తీసుకుంటున్నారని ఇప్పటికే టాక్ ఉంది.