తెలుగు భామలు ఇలా ఉంటేనా!!

తెలుగు భామలు ఇలా ఉంటేనా!!

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు ఇవ్వరు.. ఇది ఎప్పుడూ వినిపించే ఆరోపణే. ఆయా మూవీ మేకర్స్.. ఎందుకు ఇలా ఛాన్సులు ఇవ్వరనే విషయాన్ని పట్టించుకోకుండా.. రోడ్డెక్కి రచ్చ చేయడం కనిపిస్తూనే ఉంటుంది.

బాలీవుడ్ తెరంగేట్రానికి సిద్ధమైన బ్యూటీ సారా ఆలీ ఖాన్. సైఫ్ కూతురుగా.. ఈమెకు ఈజీగానే ఛాన్సులు వస్తాయి. అయినా సరే.. ఈ యంగ్ భామ తన బాడీ విషయంలో తీసుకునే శ్రద్ధ చూస్తే ఔరా అనిపించక మానదు. కొంత కాలం క్రితం ఇంత ఫిట్నెస్ లేకపోయినా.. అరంగేట్ర సమయానికి భలే రెడీ అయిపోయింది. హాట్ అందాలతో నాజూకుగా మెరిసిపోతోంది సారా. ఒక్క సైఫ్ డాటర్ మాత్రమే కాదు.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే బాలీవుడ్ కుర్ర భామలు చాలామందే ఇలా ముందుస్తుగానే ప్రిపేర్ అయిపోతుంటారు.

ఒక్కో వృత్తికి ఒక్కో క్వాలిటి ఉన్నట్లుగానే.. హీరోలు హీరోయిన్లు ఫిట్ గా ఉంటేనే జనాలు చూస్తున్నారు.  మరి సారా ఆలీ ఖాన్ తరహాలో మన దగ్గర ఎవరున్నారు?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు