సిల్క్ స్మితకు అన్యాయం జరిగిందే

సిల్క్ స్మితకు అన్యాయం జరిగిందే

మన దేశంలో ఇప్పుడు బయోపిక్స్ సీజన్ సూపర్ స్పీడ్ లో ఉంది. చరిత్ర ఆధారంగానే కాదు.. వ్యక్తుల ఆధారంగా కూడా చిత్రాలు వచ్చేస్తున్నాయి. వీటిలో చాలావరకు మంచి విజయాన్ని కూడా అందుకుంటున్నాయి.

దంగల్ అంటూ మహావీర్ సింగ్ ఫొగాట్ జీవితాన్ని.. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కించారు. సిల్క్ స్మిత లైఫ్ ఆధారంగా విద్యాబాలన్ డర్టీ పిక్చర్ తీశారు. ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ అంటూ ధోనీపై బయోపిక్ వచ్చింది. భాగ్ మిల్కా భాగ్ అంటూ మిల్కా సింగ్ జీవితాన్ని తెరకెక్కించారు. ఇండియా క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై అజార్ చిత్రం రూపొందింది. మేరీ కోమ్ అంటూ బాక్సర్ లైఫ్ పై ప్రియాంక చోప్రా చేసిన చిత్రం సక్సెస్ సాధించింది. నీర్జా అంటూ సోనమ్ కపూర్ చేసిన లైఫ్ స్టోరీ కూడా విజయవంతం అయింది. ప్యాడ్ మ్యాన్ పేరుతో రీసెంట్ గా బంపర్ సక్సెస్ కొట్టాడు అక్షయ్ కుమార్. సంజు అంటూ సంజయ్ దత్ లైఫ్ పై సినిమా రూపొందుతోంది. సావిత్రిపై టాలీవుడ్ లో వచ్చిన మహానటి విజయాన్ని చూస్తూనే ఉన్నాం.

ఈ బయోపిక్స్ ను రూపొందించినందుకు గాను.. ఆయా వ్యక్తులకు కానీ.. లేకుంటే వారి కుటుంబ సభ్యులకు కానీ లాభాల్లో భారీగా వాటాలు దక్కాయి. అందుకే వారే ప్రచారం చేసుకుని మరీ మూవీ సక్సెస్ లో భాగంగా నిలిచారు. కానీ ఒక్క సిల్క్ స్మిత స్టోరీ విషయంలోనే సీన్ రివర్స్ అయింది. సిల్క్ స్మిత తమ్ముడిని ఏక్తా కపూర్ అసలు ఖాతరు చేయలేదు. పైగా ఆయన మాటలను ప్రచారానికి కూడా వాడేసిన వైనం కనిపించింది. జీవితాలను సినిమాలుగా మలిచి కమర్షియల్ హిట్ కొట్టడం ఓకే అయినా.. సిల్క్ స్మిత విషయంలో మాత్రం అన్యాయం జరిగిందని ఒప్పుకోవాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు