శ్రీదేవితోనే ఆ సినిమా కూడా పోయింది

శ్రీదేవితోనే ఆ సినిమా కూడా పోయింది

శ్రీదేవికి బాలీవుడ్లో తిరుగులేని పేరును.. విజయాన్ని అందించిన సినిమా ‘మిస్టర్ ఇండియా’. శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి ముందు బోనీకపూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ ఈ సినిమాను రూపొందించాడు. అనిల్ కపూర్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది. ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకుంది.

ఈ చిత్రానికి సీక్వెల్ తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాడు బోనీకపూర్. ఈ మధ్య శేఖర్ కపూర్‌ను సంప్రదించి ఇందుకు సన్నాహాలు కూడా చేశాడు. కానీ ఈ పని జరుగుతుండగానే శ్రీదేవి హఠాత్తుగా ప్రాణాలు విడిచింది. దీంతో ‘మిస్టర్ ఇండియా-2’కు బ్రేక్ పడింది. మరి ఈ ప్రాజెక్టు భవితవ్యం ఏంటి.. శ్రీదేవికి నివాళిగా ఈ చిత్రాన్ని తీస్తారా అని శేఖర్ కపూర్‌ను అడిగితే.. అందుకే అవకాశమే లేదన్నాడు.

తమ అందరికీ ‘మిస్టర్ ఇండియా-2’ ఒక కలల సినిమా అని.. చాలా ఇష్టంగా ఆ సినిమా చేయాలనుకున్నామని.. కానీ శ్రీదేవి వెళ్లిపోవడంతో ఆ కల భగ్నం అయిపోయిందని శేఖర్ చెప్పాడు. శ్రీదేవి లేకుండా ‘మిస్టర్ ఇండియా-2’ను ఊహించుకోలేనని.. ఆ సినిమా చేయలేనని ఆయన తేల్చేశాడు. ఒకవేళ బోనీ కపూర్ వేరే ఎవరితో అయినా ఈ చిత్రం చేయాలనుకుంటే ఆయన ఇష్టమని.. తాను మాత్రం ఈ సినిమా చేయడానికి ఎంతమాత్రం సుముఖంగా లేనని స్పష్టం చేశాడు శేఖర్.

బోనీని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు దూరమైన శ్రీదేవి.. చాలా ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకుని ‘ఇంగ్లిష్ వింగ్లిష్’.. ‘పులి’.. ‘మామ్’ సినిమాలు చేసింది. అలాగే షారుఖ్ ఖాన్ చిత్రం ‘జీరో’లో ఓ ప్రత్యేక పాత్రకు అంగీకరించింది. ఇంకో రెండు సినిమాలు కూడా చర్చల దశలో ఉండగా ఆమె హఠాత్తుగా చనిపోయింది. దీంతో ఆయా సినిమాల్లో తన పాత్రలకు వేరేవాళ్లను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English