‘భాగమతి’ ఈజ్ బ్యాక్

‘భాగమతి’ ఈజ్ బ్యాక్

గత కొన్నేళ్లుగా ఆచితూచి సినిమాలు ఎంచుకుంటోంది అనుష్క. ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చాక చాలా గ్యాప్ తర్వాత ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకొచ్చిందామె. ఈ సినిమాకు చాలా మంచి ఫలితమే దక్కింది. ఐతే ‘బాహుబలి’తో పాటు ‘భాగమతి’ సైతం బాగా డిలే అయిన సినిమాలు. ఇవి రెండూ అనుష్క ఎన్నో ఏళ్ల కిందట కమిటైన చిత్రాలు. ఇవి కాకుండా అనుష్క కొత్తగా సినిమా కమిటై చాలా కాలం అవుతోంది.

‘భాగమతి’ అంత మంచి విజయం సాధించినా.. వెంటనే అనుష్క కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు. ఐతే తాజాగా ఆమె ఓ సినిమాకు కమిటైనట్లు వార్తలొస్తున్నాయి. ఇంతకుముందు ‘180’ అనే సినిమా తీసి.. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ‘నా నువ్వే’ చిత్రాన్ని రూపొందించిన జయేంద్ర దర్శకత్వంలో అనుష్క నటించబోతోందట.

గోపీచంద్-అనుష్క కాంబినేషన్లో జయేంద్ర ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు గోపీతో అనుష్క ‘లక్ష్యం’.. ‘శౌర్యం’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ రెండూ పెద్ద హిట్లయినా మళ్లీ ఆ కాంబినేషన్ కుదర్లేదు. ఐతే క్లాస్ సినిమాలు తీసే జయేంద్ర ఈ కమర్షియల్ జోడీతో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని వార్తలొస్తున్నాయి. గోపీ ప్రస్తుతం ‘పంతం’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

అతడికి ఇంకో రెండు వేరే కమిట్మెంట్లు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి జయేంద్రతో సినిమా చేయడానికి గోపీ ముందుకొచ్చినట్లు సమాచారం. ఇక అనుష్క విషయానికొస్తే తమిళంలో జ్యోతిక ప్రధాన పాత్రలో బాలా తెరకెక్కించిన ‘నచ్చియార్’ తెలుగు రీమేక్‌లో ఆమె నటించబోతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఆ చిత్రంలో జ్యోతిక రఫ్ పోలీస్ పాత్రలో అదరగొట్టింది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English