మాధురిని పెళ్లి చేసుకోమంటే వద్దన్నాడట

మాధురిని పెళ్లి చేసుకోమంటే వద్దన్నాడట

భారతీయ సినిమాను ఏలిన హీరోయిన్లలో మాధురీ దీక్షిత్ ఒకరు. శ్రీదేవి తర్వాత అంతగా అభిమానుల్ని సంపాదించుకుని తిరుగులేని స్థాయికి చేరింది మాధురి. అలాంటి అందమైన భార్య కావాలని ఎవరు కోరుకోరు? కానీ మాధురిని పెళ్లి చేసుకోవడానికి ఒక బాలీవుడ్ గాయకుడు మాత్రం అంగీకరించలేదట. ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఆఫర్‌ను తోసి పుచ్చాడట. ఆ గాయకుడి పేరు.. సురేశ్ వడ్కార్. అతను పేరు మోసిన గాయకుడేమీ కాదు. 80ల్లో కొంచెం పేరుండేది.
అప్పటికి మాధురి పెద్ద హీరోయిన్ ఏమీ కాదు. కెరీర్లో తొలి అడుగులు వేస్తూ ఉండేది. మాధురి సినీ రంగంలో కొనసాగడం ఇష్టం లేని ఆమె తల్లిదండ్రులు త్వరగా పెళ్లి చేసేయాలనుకున్నారట. ఆ నేపథ్యంలోనే మాధురిని పెళ్లి చేసుకోవాలని సురేశ్‌ను అడిగారట. కానీ అతను నో చెప్పేశాడట. అందుకు కారణం మాధురి అప్పట్లో సన్నగా ఉండటమే. ఆ మాట విని మాధురి తల్లిదండ్రులు మరింత మథనపడ్డారట. కూతురి జీవితం ఏమవుతుందో అనుకున్నారట.

కానీ మాధురి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఇండియాలోనే నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది. బాలీవుడ్ సూపర్ స్టార్లతో భారీ విజయాలందుకుని పెద్ద రేంజికి వెళ్లింది. కోట్లాది మందికి కలల రాణి అయింది. ఆమె ఎదుగుదల చూసి సురేశ్ కచ్చితంగా ఫీలయ్యే ఉంటాడు. సినిమాల నుంచి తప్పుకున్నాక మాధురి లాస్‌ఏంజెల్స్‌లో స్థిరపడిన శ్రీరామ్ అనే వైద్యుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత సినీ కెరీర్‌కు దాదాపుగా టాటా చెప్పేసిన మాధురి.. ఇటీవలే మళ్లీ బాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తోంది. ఈ ఏడాది ‘బకెట్ లిస్ట్’ సహా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మాధురి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English