మహేష్ స్టన్నింగ్ లుక్ అంటున్నారే..

మహేష్ స్టన్నింగ్ లుక్ అంటున్నారే..

తన సినిమాల్లో పెద్దగా లుక్స్ మార్చని టాలీవుడ్ స్టార్లలో మమేష్ బాబు ఒకడు. చాలా వరకు అతడి సినిమాల్లో ఒకే తరహా లుక్ కనిపిస్తూ ఉంటుంది. గత పుష్కర కాలంలో మహేష్ కొంచెం డిఫరెంట్ లుక్‌లో కనిపించేదంటే ‘పోకిరి’లో మాత్రమే. ఆ సినిమా తర్వాత దాదాపుగా ప్రతి సినిమాలోనూ ఒకే లుక్‌లో దర్శనమిస్తున్నాడు. కాస్ట్యూమ్స్ మారుతుంటాయి తప్ప మహేష్ లుక్‌లో మార్పుండదు. ఐతే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమాలో మాత్రం మహేష్ లుక్ మారబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో భాగంగా వచ్చే ఒక ఎపిసోడ్లో మహేష్ గుబురు గడ్డం మీసంతో కనిపిస్తాడట. అందుకోసం మహేష్ ఒరిజినల్‌గా గడ్డం, మీసం పెంచుతాడా.. లేక మేకప్ ద్వారా మేనేజ్ చేస్తారా అన్నది తెలియదు.

కానీ మహేష్ లుక్ మాత్రం మారబోతుండటం పక్కా అంటున్నారు. అది చాలా స్టన్నింగ్‌గా కూడా ఉంటుందని అంటున్నారు. మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’లో ఒక పాటలో సీఎం భరత్‌గా మహేష్ మీసం పెట్టుకుని మారువేషంలో  తిరుగుతాడు. అది చాలా ఫన్నీగా అనిపించింది జనాలకు. ఆ లుక్‌లో మహేష్ కృష్ణను తలపించాడు. మహేష్‌కు గడ్డం, మీసం తక్కువగా వస్తాయి. కొన్ని సినిమాల్లో లైట్ మీసం, గడ్డంతో‌ కనిపించాడు కానీ.. ఎప్పుడూ గుబురుగా పెంచింది లేదు. ఒకవేళ అవి పెంచి ఒరిజినల్‌ లుక్‌లోనే మహేష్ కనిపిస్తే కొత్తగా ఉంటాడనడంలో సందేహం లేదు. మరి వంశీ సినిమాలో అతనెలా కనిపిస్తాడో చూడాలి. దిల్ రాజు-అశ్వినీదత్ ఉమ్మడిగా నటించే ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టి.. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు