జైలు శిక్షపై సల్మాన్ స్పందించాడు

జైలు శిక్షపై సల్మాన్ స్పందించాడు

తనపై ఉన్న కేసులు.. తనకు జైలు శిక్షలు పడటం.. బెయిల్ తీసుకోవడం గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఎప్పుడూ స్పందించడు. సల్మాన్ ఏదైనా ప్రెస్ మీట్లకు వచ్చినా అతడిని ఇబ్బంది పెట్టే ఇలాంటి అంశాలపై ప్రశ్నలు వేయొద్దని మీడియాకు ముందే సమాచారం అందుతుంది. గత నెలలో కృష్ణజింకల కేసులో సల్మాన్‌‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడటం.. తర్వాత బెయిల్ రావడం తెలిసిందే. దీనిపై మీడియా వాళ్లు ప్రశ్నలు అడగడానికి వీలు లేకపోయింది. సల్మాన్ వాళ్లకు ఎక్కడా దొరకలేదు. కానీ ఇప్పుడు తన కొత్త సినిమా ‘రేస్-3’ ట్రైలర్ లాంచ్ కోసం మీడియా ముందుకొచ్చాడు సల్లూ భాయ్. అక్కడ ఒక విలేకరి కృష్ణజింకల కేసు గురించి ప్రశ్నించి అతడిని ఇబ్బంది పెట్టేశాడు.

దీనికి బదులిస్తూ.. ‘నేను జీవితాంతం జైల్లోనే ఉండాలనుకుంటున్నారా’ అని ప్రశ్నించాడు సల్మాన్. దీంతో ఆ విలేకరి ‘లేదు’ అన్నాడు. అంతటితో ఆ టాపిక్ ముగిసిపోయింది. ఇక కథువాలో బాలికపై అత్యాచారం గురించి ప్రశ్నిస్తే.. ఇలాంటి ఘోరాలు ఇకపై జరగకుండా చూసుకోవాలి అన్నాడు. కృష్ణజింకల కేసు గురించి అడిగినపుడు సల్మాన్‌లో అసహనం బాగా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ కేసులో తనకు పడ్డ శిక్షను కొట్టివేస్తూ తీర్పు ఇవ్వాల్సిందిగా సల్మాన్ జోధ్‌పూర్ కోర్టులో పిటిషన్ వేశాడు సల్మాన్. ఈ కేసును కోర్టు జులైకి వాయిదా వేసింది. అప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో అని సల్మాన్ చాలా టెన్షన్లో ఉన్నాడని.. కొన్ని రోజుల పాటు అతను ‘రేస్-3’ పని పక్కన పెట్టేసి ఇంటిపట్టునే ఉండిపోయాడని.. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఆలస్యం కావడానికి కూడా అదే కారణమని వార్తలొచ్చాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు