హీరోయిన్ బాగుంటే చాలా.. హీరోకి సెట్ అవద్దా?

హీరోయిన్ బాగుంటే చాలా.. హీరోకి సెట్ అవద్దా?

ఏ సినిమాకి అయినా లీడ్ పెయిర్ కాంబినేషన్ చాలా ముఖ్యం. సినిమాను నడిపించే ప్రధాన పాత్ర హీరో.. అతడి ప్రేయసిగానో భార్యగానో నటించే హీరోయిన్.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలను జనాలు ఎక్కువగా చూడాల్సి ఉంటుంది. సినిమా కథలో భాగం అయినా కాకపోయినా.. పాటలు వారి మధ్య ఉంటాయ్ కాబట్టి.. రెండున్నర గంటల సినిమాలో హీరో హీరోయిన్ కలిసి అరగంట నుంచి ముప్పావుగంట వరకు మనల్ని ఎంటర్టెయిన్ చేస్తూ ఉంటారు.

హీరోహీరోయిన్ కాంబోకి ఇంత సుదీర్ఘమైన స్క్రీన్ స్పేస్ ఉండడంతోనే.. ఆ జంటను సెట్ చేయడానికి నానా తిప్పలు పడుతుంటారు మేకర్స్. కానీ మన దగ్గర ఓ హీరోగారు ఉన్నారు. ఈయన ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోడని అంటారు. తన వయసు 50దాటిపోయినా.. ఇంకా కుర్రాడి పాత్రలలో కనిపించేయడం ఓకే అయినా.. తన ఏజ్ లో సగం కూడా లేని అమ్మాయిలను ఏరికోరి ఎంపిక చేసి మరీ హీరోయిన్స్ గా సెట్ చేయిస్తూ ఉంటాడు. ఈ విషయంలో మేకర్స్ పై ఒత్తిడి కూడా పెడతాడనే టాక్ ఉంది.

రీసెంట్ గా ఈ హీరో కొత్త మూవీకి ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ లో మెప్పించలేకపోయిన విషయం ఏదన్నా ఉందంటే.. హీరో హీరోయిన్ మధ్య కనిపిస్తున్న ఏజ్ గ్యాప్. చిన్న పాటి షాట్స్ లోనే వయసు తేడా కొట్టొచ్చినట్లు కనిపించేస్తోంది. కానీ ఈయనేమో అలాంటివేమీ పట్టించుకునే ఉద్దేశ్యంలో లేడని అర్ధం అవుతూనే ఉంది. తర్వాతి ప్రాజెక్టుల విషయంలో అయినా.. ఈయన కాస్త జాగ్రత్త పడితే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు