అందుకే టాలీవుడ్ కి పాలిటిక్స్ భయం

అందుకే టాలీవుడ్ కి పాలిటిక్స్ భయం

తెలుగులో రాజకీయ నేపథ్యంతో పెద్దగా సినిమాలు రావు. జనాలు చూడరు అని మేకర్స్ చెబుతుంటారు కానీ.. అసలు తీసేందుకే ధైర్యం చేయరు అనేది ఇన్ సైడ్ టాక్. ఇందుకు కారణం.. రాజకీయ నాయకులు ప్రతీ అంశాన్ని తమకోసం ఉపయోగించేసుకునేందుకు ప్రయత్నించడమే.

రీసెంట్ గా భరత్ అనే నేను చిత్రం వచ్చింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో.. హీరోపాత్రకు భరత్ రామ్ అని పేరు పెట్టేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ డబ్బులు ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇదో విచిత్రమైన వాదన అనే మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. మన దేశం పేరు భారత్.. అందరూ కొలిచే రాముడు.. ఈ రెండూ కలిపి టైటిల్ ఉందనే సంగతి ఈజీగానే అర్ధం అవుతున్నా.. కేటీఆర్ లో పేరులోని రామారావు.. ఇక్కడకు ఎలా లింక్ అయ్యాడో చెప్పడం కష్టం. ఆ సినిమాకు చెందిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొనడమే ఇలాంటి వాటికి బేస్ అనుకోవచ్చు. మన దగ్గర మేకర్స్ పొలిటికల్ సబ్జెక్టులు ఎంచుకోవడంలో ఇందుకే భయపడుతుంటారు.

సినిమాలో చూపించిన కల్పిత పాత్రలకు.. రియల్ లైఫ్ లో ఎవరినో ఒకరిని పోలిక పెట్టి హంగామా సృష్టిస్తుంటారు. అందుకే అసలు పాలిటిక్స్ పై తమ అభిప్రాయాలను కూడా వెల్లడించేందుకు ఇండస్ట్రీ జనాలలో మెజారిటీ వర్గం ముందుకు రారు. అదే కోలీవుడ్.. బాలీవుడ్ లను తీసుకుంటే..  నేరుగా తమ అభిప్రాయాలు చెప్పడమే కాదు.. పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు కూడా చేస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమాలో రాజకీయాలు అనగానే.. వివాదం ఎక్కడ దొరుకుతుందా అని వెతుక్కునే పద్ధతి కారణంగానే.. తీసేందుకు మేకర్స్ ముందుకు రావడం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు