రంగమ్మత్త హుషారు మామూలుగా లేదుగా

రంగమ్మత్త హుషారు మామూలుగా లేదుగా

టాలీవుడ్ బ్యూటీ అనసూయ.. ఎప్పటి నుంచో సినిమాలు ట్రై చేస్తోంది కానీ.. ఆమెకు ఇప్పటికి తను కోరుకున్న స్థాయికి దాదాపు చేరుకోగలిగింది. జబర్దస్త్ టీవీ షోకి గ్లామర్ అద్ది కొత్త ట్రెండ్ సృష్టించిన ఈ బ్యూటీ.. పెళ్లయిన తర్వాత కూడా వల్గర్ లేని గ్లామర్ చూపించవచ్చంటూ ప్రూవ్ చేసింది. ఇప్పటివరకూ ఒక ఎత్తు అయితే.. రామ్ చరణ్ రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రను.. ఈమెకు కెరీర్ టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు.

ఆ పాత్రలో అనసూయ మెప్పించిన తీరు.. సినిమా సక్సెస్ లో తనూ ఒక భాగం అయిన విధానం అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ హాట్ బ్యూటీకి అవకాశాలు క్యూ కట్టేయడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ప్రాజెక్టుల ఎంపిక విషయంలో మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తోంది అనసూయ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎఫ్2 మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఈమెను సంప్రదించాడట దర్శకుడు. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ వెంకటేష్- వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ ఇది.

సరదాగా ఉండే ఓ గ్రామీణ మహిళ పాత్రను అనసూయ చేయబోతోందట. మరోవైపు 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' అంటూ తనే టైటిల్ రోల్ చేసే ఓ మూవీకి కూడా అనసూయ అంగీకరించింది. ఐటెం భామగా మిగిలిపోయేందుకు ఒప్పుకోలేదని ఒకప్పుడు తిట్లు తిన్న అనసూయ.. ఇప్పుడు లీడ్ క్యారెక్టర్లు చేసేవరకూ ఎదిగిన విధానాన్ని.. ప్రశంసించాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English