నాలోను రంగమ్మత్తని చూడండి ప్లీజ్‌

నాలోను రంగమ్మత్తని చూడండి ప్లీజ్‌

అనసూయకి, సురేఖావాణికి మధ్య వయసులో పెద్ద వ్యత్యాసం లేదు. కాకపోతే సురేఖా వాణి చేసే పాత్రల వల్ల ఆమెకి ఎప్పుడో ఆంటీ ఇమేజ్‌ వచ్చేసింది. అనసూయ ఇంకా గ్లామరస్‌ పాత్రల్లోనే కనిపిస్తోంది. ఇద్దరూ బిడ్డ తల్లులయినా కానీ తనని పెద్ద ఆంటీలా చూడడాన్ని సురేఖావాణి తట్టుకోలేకపోతున్నట్టుంది. అందుకే సోషల్‌ మీడియాలో అనసూయ ఏమి చేస్తుందో అచ్చంగా అదే సురేఖ కూడా చేస్తోంది. ప్రైవేట్‌ ఫోటోల్లో గ్లామరస్‌గా కనిపించే అనసూయని స్ఫూర్తిగా తీసుకుని పొట్టి దుస్తుల్లో, పారదర్శకత వున్న దుస్తుల్లో కనిపిస్తోంది.

అప్పుడెప్పుడో స్విమ్మింగ్‌ పూల్‌లో వున్న ఫోటోలని అనసూయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సురేఖావాణి కూడా అలాంటి ఫోటోలనే పెట్టి తనలో ఈ యాంగిల్‌ని కూడా చూడమని అడుగుతున్నట్టుగా అంతర్లీన సందేశాన్ని ఇండస్ట్రీకి పాస్‌ చేస్తోంది. రంగమ్మత్త పాత్రతో అనసూయ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా హాట్‌ అయిపోయింది. తనకి కూడా ఛాన్స్‌ ఇస్తే అలాంటి పాత్రలు ఇరగదీయగలనని సురేఖావాణి ఇలా చాటుకుంటోంది.

అయితే ఇప్పటికే తనపై ఒక ముద్ర వేసేసిన ఇండస్ట్రీ ఆ ఇమేజ్‌ని మార్చే ప్రయత్నం చేస్తుందా అనేది అనుమానమే కానీ సురేఖ మాత్రం హాట్‌ ఫోటోలు రెగ్యులర్‌గా ఇంటర్నెట్‌లో పెడుతూ గట్టిగానే ట్రై చేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English