బాహుబలి కంటే పెద్ద ఫీట్‌ ఇది

బాహుబలి కంటే పెద్ద ఫీట్‌ ఇది

మహానటి చిత్రానికి యుఎస్‌లో 1.9 మిలియన్‌ డాలర్లు వసూలయ్యాయి. ఈ శుక్రవారంతో రెండు మిలియన్‌ డాలర్ల మార్కుని దాటుతుంది. పేరున్న దర్శకుడు కానీ, హీరో కానీ లేకుండా యుఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్లు వసూలు చేసిన తొలి చిత్రంగా మహానటి రికార్డులకెక్కుతోంది. ఫిదా చిత్రానికి దర్శకుడైన శేఖర్‌ కమ్ములకి యుఎస్‌లో తిరుగులేని మార్కెట్‌ వుంది. అలాగే రెండు మిలియన్లకి మించి వసూలు చేసిన ప్రతి సినిమాకీ హీరో లేదా దర్శకుడి రూపంలో పెద్ద స్టార్‌ వున్నాడు.

ఏ స్టారూ లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన అర్జున్‌ రెడ్డిని మహానటి ఆల్రెడీ దాటేసింది. ఫుల్‌ రన్‌లో రెండున్నర మిలియన్లకి పైగానే వసూలు చేయబోతోన్న ఈ చిత్రం మూడు మిలియన్లని రీచ్‌ అవుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మూడు మిలియన్లు వచ్చినా రాకపోయినా కానీ యుఎస్‌లో రెండు మిలియన్లు సాధించడంతోనే చిన్న సినిమాల్లో బాహుబలికి ధీటైన ఫీట్‌ని మహానటి చేసినట్టయింది.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో వసూలయిన షేర్‌కి దాదాపు సమానంగా ఒక్క యుఎస్‌లోనే ఈ చిత్రానికి వచ్చిందంటే ఆ మార్కెట్లో ఇదెంత పెద్ద హిట్‌ అనేది తెలీడం లేదూ?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English