డేట్స్‌ ఇస్తా... వద్దు డబ్బులిచ్చేయండి

డేట్స్‌ ఇస్తా... వద్దు డబ్బులిచ్చేయండి

'మెహబూబా' చిత్రం రిలీజ్‌ హక్కులని పూరి జగన్నాధ్‌ ప్రోద్బలం మీద తీసుకున్న దిల్‌ రాజు నష్టం వస్తే మొత్తం చెల్లించాలనే షరతు మీదే రిలీజ్‌ చేసాడట. ఆస్తులు అమ్మి మరీ మెహబూబా చిత్రాన్ని రూపొందించిన పూరి జగన్నాధ్‌కి దిల్‌ రాజు కొనడం వల్ల కాస్త ఊరట లభించింది. కొడుకు హీరో కావడంతో పాటు తాను కూడా కొత్త రకం సినిమా చేసాననే నమ్మకం వుండడంతో ఖచ్చితంగా పది, పదిహేను కోట్లయినా బిజినెస్‌ జరుగుతుందని పూరి జగన్నాధ్‌ భావించాడు.

కానీ మెహబూబా దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ప్రింట్లు, పబ్లిసిటీ ఖర్చులు మినహా వసూలు కాలేదు. దిల్‌ రాజుకి ఏర్పడిన నష్టాన్ని పూరి జగన్నాధ్‌ త్వరలోనే సెటిల్‌ చేయాల్సి వుంటుంది. తాను ఇవ్వాల్సిన దానికి బదులుగా సినిమా చేసి పెడతానని పూరి ఒక ఆఫర్‌ ఇచ్చాడట. అయితే తనకి అదేమీ అక్కర్లేదని, జరిగిన నష్టాన్ని మాత్రం భర్తీ చేయండని దిల్‌ రాజు చెప్పాడట.

ఒప్పందం ప్రకారం దిల్‌ రాజుకి జరిగిన నష్టాన్ని కొన్ని రోజుల్లోనే వెనక్కి ఇవ్వాలట. అందుకే ఏదైనా అవకాశం వస్తే ఆ అడ్వాన్సు ఇటు ఇవ్వాలని జగన్‌ చూస్తున్నాడట. ప్రస్తుతానికి తనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎవరూ ఆసక్తిగా లేకపోవడంతో పూరి జగన్‌ ఒత్తిడికి గురవుతున్నాడని ఇండస్ట్రీ భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English