ఉదయ్‌కిరణ్‌ సినిమా.. చిరంజీవితో పేచీ!

ఉదయ్‌కిరణ్‌ సినిమా.. చిరంజీవితో పేచీ!

సావిత్రి బయోపిక్‌ని ఎంతో ఆసక్తిగా తెలుగువారంతా చూసేస్తూ వుండడంతో ఇంకెవరైనా నటీనటుల జీవితాలని తెరకెక్కిస్తే బాగుంటుందా అని దర్శకులు ఆలోచిస్తున్నారు. తారాపథంలోకి దూసుకెళ్లి, చిరంజీవికి అల్లుడు కాబోయి, తర్వాత కెరియర్‌లో ఫ్లాపులు చవిచూసి, చివరకు ఆత్మహత్య చేసుకున్న ఉదయ్‌కిరణ్‌ కథని తెరకెక్కిస్తే తప్పకుండా క్రేజ్‌ వుంటుందని తేజ భావిస్తున్నాడు. మిగతా సినిమాలన్నీ పక్కన పడేసి ఈ చిత్రం తీయడానికి అతను పూనుకుంటున్నాడని సమాచారం.

తేజ ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోయినా కానీ 'కాబోయే అల్లుడు' అనే కాంట్రవర్షియల్‌ టైటిల్‌ దీనికి ఫిక్స్‌ చేసారని కూడా ప్రచారం జరుగుతోంది. ఉదయ్‌ కిరణ్‌ కథకి బాక్సాఫీస్‌ పొటెన్షియల్‌ వున్నా కానీ తేజ దానిని కాంట్రవర్షియల్‌గా మలిచే అవకాశం వుండడంతో ఈ చిత్రాన్ని అధికారికంగా నిర్మించడానికి ఎవరూ ముందుకి రావడం లేదట. తేజ ఈ చిత్రాన్ని చిత్రం మూవీస్‌పై స్వీయ నిర్మాణంలో తీస్తాడని అంటున్నారు.

అయితే ఈ చిత్రానికి నిర్మాతలు వుంటారని, బ్యాక్‌ఎండ్‌లోనే వుంటారు కానీ అఫీషియల్‌గా నిర్మించరని ఒక టాక్‌ వినిపిస్తోంది. చిరంజీవి అభిమానుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం వుండడంతో ఈ చిత్రంతో డైరెక్ట్‌ కాంటాక్ట్‌కి, కాంట్రాక్ట్‌కీ ఎవరూ సాహసించడం లేదట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English