షాకింగ్: తెలుగు దర్శకుడి ఆత్మహత్యాయత్నం

షాకింగ్: తెలుగు దర్శకుడి ఆత్మహత్యాయత్నం

సందీప్ కిషన్-నిత్యా మీనన్ జంటగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ సినిమా తీసిన రాజసింహా ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. సినీ కెరీర్లో ఒడుదొడుకులు.. వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా ఒత్తిడికి గురైన రాజసింహ.. అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. అతను ముంబయిలో ఈ ప్రయత్నం చేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాజసింహను ముంబయిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రాజసింహ ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. రాజసింహా దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు. ఘోస్ట్ రైటర్‌గా పలు సినిమాలకు పని చేశాడు. అతడికి రచయితగా పేరు తెచ్చి పెట్టిన సినిమా ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ చేసిన గోన గన్నారెడ్డి పాత్ర అంత బాగా రావడం వెనుక రాజసింహా కృషి ఉంది. ఈ విషయాన్ని దర్శకుడు గుణశేఖర్.. హీరో అల్లు అర్జున్ కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పారు.

తెలంగాణ యాసలో ఆ పాత్రకు అదిరిపోయే డైలాగులు రాయడమే కాదు.. బన్నీకి ఈ యాసలో శిక్షణ ఇచ్చి ఆ పాత్రను చాలా బాగా తీర్చిదిద్దడంలో రాజసింహా కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా తెచ్చిన గుర్తింపుతో అతను దర్శకుడిగా కూడా అవకాశం అందుకున్నాడు. సందీప్ కిషన్ హీరోగా ‘ఒక్క అమ్మాయి తప్ప’ తీశాడు. తన నిజ జీవితంలో ఎదురైన అనుభవాల ఆధారంగా ఈ కథ రాసి సినిమా తీశాడు. ఐతే ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. అంతటిలో దర్శకుడిగా రాజసింహా ప్రయాణం ఆగిపోయింది. తర్వాత అతడి పేరు వినిపించలేదు. ఇప్పుడిలా ఆత్మహత్యాయత్నం వార్తతో వెలుగులోకి వచ్చాడు రాజసింహ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English