కెరీర్ క్లోజే అన్నమాట!

కెరీర్ క్లోజే అన్నమాట!

అసలే వరుస ఫ్లాపులు.. పైగా తేలిపోతున్న క్యారెక్టర్లు.. యాక్టింగ్ రాదన్న విమర్శలు.. ఇవన్నీ చాలవన్నట్లు ప్రమోషన్‌కు సహకరించదన్న ముద్ర.. ఇంతకంటే ఒక హీరోయిన్ కెరీర్ నాశనం కావడానికి ఇంకేం కావాలి? అను ఇమ్మాన్యుయెల్ విషయంలో ఇలాగే జరుగుతోంది. ‘మజ్ను’ లాంటి యావరేజ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది మలయాళ భామ అను. ఆ తర్వాత ఆమె నటించిన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ కూడా యావరేజ్‌గానే ఆడింది.

ఇలాంటి చిన్న సినిమాలు చేసిన ఆమెకు.. అనూహ్యంగా ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ లాంటి భారీ చిత్రాల్లో సూపర్ స్టార్లతో నటించే ఛాన్సొచ్చింది. ఈ చిత్రాలతో ఆమె రేంజే మారిపోతుందని అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ జరగలేదు. ‘అజ్ఞాతవాసి’ పెద్ద డిజాస్టర్ కాగా..  ‘నా పేరు సూర్య’ కూడా ఫ్లాప్ అని తేలిపోయింది.

కొన్నిసార్లు సినిమాలు ఫెయిలైనా హీరోయిన్లకు పేరొస్తుంటుంది. కానీ అను మాత్రం అన్ని రకాలుగా మైనస్ మార్కులే వేయించుకుంది. ఇటు అందం.. అటు అభినయం.. రెండు రకాలుగా ఆమె ఇంప్రెస్ చేయలేకపోయింది. పైగా ‘నా పేరు సూర్య’ ప్రమోషన్లకు ఏమాత్రం సహకరించలేదు. రిలీజ్ తర్వాత సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. కొన్ని రోజుల పాటు ప్రమోషన్లలో పాల్గొన్నాడు. కానీ అను మాత్రం ఒక్క రోజూ ఇటు చూడలేదు. పవన్ కళ్యాణ్ హాజరైన థ్యాంక్స్ మీట్లో కూడా పాల్గొనలేదు.

దీంతో ఆమె మీద చిత్ర బృందం కూడా చాలా గుర్రుగా ఉన్నట్లు.. ఆమెను కథానాయికగా పెట్టుకుని తప్పు చేశామని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అల్లు అరవింద్ లాంటి పెద్ద నిర్మాత భాగస్వామ్యం ఉన్న బేనర్లో సినిమాకు ఇలా చేస్తే.. ఇండస్ట్రీలోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయో చెప్పేదేముంది? కాబట్టి ఆమె కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్లే అంటున్నారు. ప్రస్తుతం అను చేతిలో ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా మాత్రమే ఉంది. దాని ఫలితం ఎలా ఉన్నా.. అనుకు మరో అవకాశం దక్కడం కష్టమే అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు