తీసేస్తానంటున్న రాజు.. వద్దంటున్న పూరీ

తీసేస్తానంటున్న రాజు.. వద్దంటున్న పూరీ

మెహబూబా చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన దిల్‌ రాజుకి మరోసారి పంపిణీదారునిగా దెబ్బ తగిలింది. నిర్మాతగా వరుస విజయాలు అందుకుంటున్నా కానీ డిస్ట్రిబ్యూటర్‌గా మాత్రం దిల్‌ రాజుకి కలిసి రావడం లేదు. అయితే మెహబూబా చిత్రానికి వచ్చే నష్టం దిల్‌ రాజు ఖాతాలోకి వెళ్లదట. ఒప్పందం ప్రకారం ఈ చిత్రానికి ఎంత నష్టం వచ్చినా తానే భరిస్తానని పూరి జగన్నాధ్‌ చెప్పాడట.

ఇదిలావుంటే ఈ చిత్రానికి చాలా చోట్ల షేర్లు రావడం లేదట. డే డెఫిసిట్లు పడడంతో థియేటర్లు తగ్గిద్దామని దిల్‌ రాజు చెబుతున్నా కానీ ఈ చిత్రం పికప్‌ అవుతుందని పూరి అంటున్నాడట. సినిమాకి టాక్‌ బాగుందని, చూసిన వాళ్లు నచ్చిందని చెబుతున్నారని, నెమ్మదిగా పిక్‌ అవుతుందని పూరి జగన్నాధ్‌ చెబుతున్నాడట. ఎలాగైనా కలక్షన్లు పెంచడానికి పూరి జగన్నాధ్‌ స్వయంగా థియేటర్ల చుట్టూ తిరుగుతున్నాడు కూడా.

అయితే ఇంతవరకు కలక్షన్ల పరంగా ఎలాంటి పెరుగుదల కనిపించకపోగా నానాటికీ వసూళ్లు క్షీణిస్తున్నాయి. వచ్చిన షేర్లు కూడా పోతాయని దిల్‌ రాజు వారిస్తున్నా కానీ పూరి జగన్నాధ్‌ మాత్రం రెండవ వారంలో సినిమాలేవీ లేవు కనుక అందాకా వేచి చూడండని, ఎంత నష్టమయినా భర్తీ చేస్తానని చెబుతున్నాడని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English