మహేష్‌తో ఫ్లాప్‌ ఇచ్చి మాయమైనోడు

మహేష్‌తో ఫ్లాప్‌ ఇచ్చి మాయమైనోడు

మహేష్‌కి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'లాంటి గుర్తుంచుకోతగ్గ సినిమాని ఇచ్చిన శ్రీకాంత్‌ అడ్డాల 'బ్రహ్మూెత్సవం'తో మరచిపోలేని పరాజయాన్ని కూడా ఇచ్చాడు. అంతకు ముందు వరకు శ్రీకాంత్‌ అడ్డాలతో సినిమా తీయడానికి చాలా మంది నిర్మాతలు సిద్ధంగా వున్నారు. కానీ బ్రహ్మూెత్సవం తర్వాత అతనంటే హీరోలు, నిర్మాతలు భయపడిపోయారు. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో వచ్చిన పేరుని ముకుంద, బ్రహ్మూెత్సవంతో చెడగొట్టుకున్న శ్రీకాంత్‌ అడ్డాల పరిశ్రమకి పూర్తిగా దూరంగా వెళ్లిపోయాడు.

ఈ సమయంలో అతను తనదైన శైలిలో ఒక పల్లెటూరి కథ రాసాడట. గోదావరి జిల్లాల వాతావరణాన్ని ప్రతిబింబించే శ్రీకాంత్‌ అడ్డాల ఈసారి కూడా అదే నేపథ్యంలో ఒక చక్కని కుటుంబ కథని రాసుకున్నాడట. ఈ కథని శర్వానంద్‌తో తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడట. శర్వానంద్‌ సానుకూలంగానే వున్నాడు కానీ పూర్తిగా కథ సిద్ధమయితే ఫుల్‌ నెరేషన్‌ విని ఓకే చేస్తానన్నాడట.

శర్వానంద్‌కి నెరేషన్‌ ఇచ్చేముందే డైలాగ్‌ వెర్షన్‌ కూడా పూర్తి చేసి రావాలని అడ్డాల ప్రస్తుతం ఆ పని మీద వున్నాడట. మంచి దర్శకుడనిపించుకున్న అడ్డాల తిరిగి ఫామ్‌లోకి వస్తే తెలుగు ఇండస్ట్రీకి ఖచ్చితంగా ప్లస్సే. డైరెక్టర్ల ట్రాక్‌ రికార్డ్‌ చూడకుండా ప్రస్తుతం వారు రాసుకున్న కథని మాత్రమే చూసి అవకాశమిస్తోన్న శర్వానంద్‌కి ఈ కథ నచ్చినట్టయితే అడ్డాల టైమ్‌ మళ్లీ స్టార్ట్‌ అయినట్టే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English