తమిలోళ్లకి భరత్ నచ్చుతాడా?

తమిలోళ్లకి భరత్ నచ్చుతాడా?

తెలుగులో సూపర్ హిట్ సాధించిన మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను.. టాలీవుడ్ ఆడియన్స్ ను బాగానే మెప్పించింది. పెద్దగా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా.. ఫ్లాట్ నెరేషన్ ఇచ్చినా సరే.. మహేష్ ఇమేజ్ ఈ సినిమాను పాస్ చేసేసింది. ఇప్పుడీ భరత్ అనే నేను మూవీని తమిళ్ లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి.

'భరత్ ఎన్నుం నాన్' అంటూ తమిళ్ డబ్బింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. ఈ నెల 25న తమిళనాడులో గ్రాండ్ గానే తమిళ్ వెర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ఇంతకీ తమిళ్ ఆడియన్స్ ను మహేష్ ఏ మాత్రం ఆకట్టుకుంటాడన్నదే పాయింట్. స్పైడర్ మూవీతో తమిళ్ మార్కెట్ ను క్యాప్చర్ చేయడం కోసం.. తన పాత్ర కంటే విలన్ రోల్ కే ఇంపార్టెన్స్ ఇచ్చి మరీ సినిమా చేశాడు మహేష్. అది రెండు చోట్లా బోల్తా కొట్టేసింది. ఇప్పుడు ఫుల్ ప్లెడ్జెడ్ గా హీరో ఇమేజ్ ఆధారంగానే రూపొందిన భరత్ అనే నేను తమిళ్ లోకి వెళుతోంది.

మనకంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి.. భరత్ ఆకట్టుకోగలిగాడు. కానీ కోలీవుడ్ లో అలా కాదు.. పలు దశాబ్దాలుగా స్ట్రెయిట్ పాలిటిక్స్ పైనే సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు డల్లుగా సాగే స్క్రీన్ ప్లేతో రూపొందిన భరత్.. కోలీవుడ్ ఆడియన్స్ ను ఎంతమాత్రం మెప్పించగలడా అనేదే అసలు ప్రశ్న. స్పైడర్ ద్వారా మహేష్ ఏ మేరకు తమిళ ఆడియన్స్ కు దగ్గరయ్యాడో.. భరత్ ఎన్నుం నాన్ తేల్చేయనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు