ఆయన ఫ్లాపులు దెబ్బ నితిన్ కి తగిలిందే

ఆయన ఫ్లాపులు దెబ్బ నితిన్ కి తగిలిందే

దిల్ రాజుకు వరుసగా షాకులు కొట్టేస్తున్నాయి. డిస్ట్రిబ్యూషన్ పరంగా ఈయన జడ్జిమెంటల్ స్కిల్స్ అద్భుతం అని టాలీవుడ్ ఇండస్ట్రీ జనాలు మాత్రమే కాదు.. ఆడియన్స్ లో కూడా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. లేటెస్ట్ మెహబూబా సహా.. దిల్ రాజు ఇప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో తన మరుసటి సినిమాల విషయంలో మరింతగా దృష్టి పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సెట్స్ పై ఉన్న ప్రాజెక్టుల విషంయలో కూడా చాలా పట్టుదలగా ఉన్నాడట దిల్ రాజు. ఈ ప్రభావం నేరుగా యంగ్ హీరో నితిన్ పైనే పడుతోంది. శతమానం భవతి ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో.. శ్రీనివాస కళ్యాణం అంటూ నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అనుకున్న ప్రకారం అయితే.. ఈ చిత్రం జూలై 27 నాటికి విడుదల కావాలి. ఇంకా రెండున్నర నెలల సమయం ఉన్నా సరే.. ఆ డేట్ కు శ్రీనివాస కళ్యాణం విడుదల కాదంటూ.. ఇప్పటికే ట్రేడ్ జనాలకు ఇన్ఫర్మేషన్ వచ్చేసిందట.

ఆగస్ట్ చివరి వారంలో శ్రీనివాస కళ్యాణం విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇలా నెల రోజులకు పైగా సమయం ఎక్కువ పట్టడానికి కారణం.. దిల్ రాజు సూచనల మేరకు రీషూట్స్ ప్లానింగ్ చేయడమే అంటున్నారు. రంగస్థలం.. భరత్ అనే నేను.. మహానటి సక్సెస్ లను గమనిస్తే.. ప్రస్తుతం ఆడియన్స్ టేస్ట్ లో మార్పు వచ్చిందనే సంగతి అర్ధమవుతోంది. అందుకు తగినట్లుగా తన మూవీస్ ఉండేలా దిల్ రాజు ప్లాన్ చేయడం.. నితిన్ పై నేరుగా ఎఫెక్ట్ పడుతోందని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English