రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ క్రిష్‌ తీస్తున్నాడా?

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ క్రిష్‌ తీస్తున్నాడా?

బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఆ తర్వాత ఏ సినిమా చేస్తాడా అనే ఆసక్తి కనిపించగా.. ఇందులో మహాభారతం ప్రాజెక్టు కూడా వినిపించింది. ఇందుకు కారణం.. తనకు మహాభారతాన్ని సినిమా సిరీస్ గా తీయాలని ఎప్పటి నుంచో కోరిక అని పలుమార్లు చెప్పడమే. కాకపోతే తను అనుకున్న విధంగా టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడమే.. ఈ చిత్రాన్ని ఇంకా పట్టాలెక్కించకపోవడానికి కారణం అని కూడా చెప్పాడు జక్కన్న.

అయితే ఇప్పుడు ట్యాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్.. రాజమౌళికి షాక్ ఇచ్చేట్లుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ మణికర్ణికను పూర్తి చేస్తున్న ఈ దర్శకుడు.. ఆ తర్వాతి ప్రాజెక్టు పనులను ప్రారంభించేశాడు. పర్వ అంటూ తన డ్రీమ్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేశాడు క్రిష్. పర్వ అంటే అది కూడా మహాభారతమే. భైరప్ప అనే కన్నడ రచయిత రాసిన మహాభారతమే ఈ పర్వ. అసలు భారతంలోని దేవుళ్ల యాంగిల్ తీసేసి.. కేవలం ఇదో మానవజాతి కథ అన్నట్లు రాస్తే ఎలా ఉంటుందో.. అదే ఈ నవత ప్రత్యేకత. దీని తెలుగు వెర్షన్ ను చదివిన క్రిష్.. అప్పటి నుంచి తెగ మక్కువ పెంచుకున్నాడట.

అయితే.. ఈ పర్వ లో అనేక బోల్డ్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. క్రిష్ లాంటి దర్శకుడు మహాభారతాన్ని అది కూడా బోల్డ్ కంటెంట్ తో రూపొందించేందుకు రెడీ అవుతుండడం ఆసక్తి కలిగించే విషయమే అయినా.. ఇది జక్కన్న ఫ్యూచర్ ప్రాజెక్టు కు బ్రేక్ వేసే అంశం. ఇక ఈ పర్వ నవలలో స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉంటుంది. తెలిసిన కథనే ఉత్కంఠ కలిగించే ఉండడమే.. సినిమా రూపొందించేందుకు బీజం వేసేలా చేసింది. కాని ఇంతవరకు దీనిపై అఫీషియల్ గా నోరు విప్పిందే లేదు. మణికర్ణిక సినిమా రిలీజయ్యాక ఏమన్నా చెబుతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English