సినిమాల్లోనూ ఆయనకు ఝలక్ తప్పదా?

సినిమాల్లోనూ ఆయనకు ఝలక్ తప్పదా?

యాక్టర్ సాయి కుమార్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొట్టేస్తున్నాడు. ఒకవైపు తన కొడుకు ఆదిని హీరోగా నిలబెట్టడం.. మరోవైపు తన ఇమేజ్ ను మార్చుకోవడం వంటి పనులతో సినిమాల్లో బిజీగా ఉంటూనే.. ఇంకోవైపు రాజకీయాల్లో కూడా గట్టి స్టెప్ నే వేశాడు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరఫున బాగేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు సాయి కుమార్. కర్నాటకలో కమలం అతి పెద్ద పార్టీగా అవతరించినా.. సాయి కుమార్ మాత్రం ఓటమి పాలయ్యాడు.

ఇది రాజకీయంగా సాయి కుమార్ కు ఎదురు దెబ్బే కానుంది. కొన్నేళ్ల పాటు సాయికుమార్ మళ్లీ యాక్టింగ్ పైనే ఫుల్లుగా ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. పొలిటికల్ గా ఓటర్లపై ప్రభావం చూపించలేకపోవడంతో.. తర్వాతి ఎన్నికలలో ఏ మేరకు టికెట్ అందుతుందో ఇప్పుడే చెప్పలేం. అయితే.. ఇలా ఓటమి పాలు కావడం సినిమాల పరంగా కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందనే వాదన కొట్టి పారేయలేం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని.. గత కొంత కాలంగా ఏకపక్షంగా విబేధిస్తున్నాడు ప్రకాష్ రాజ్. ఇది ప్రకాష్ రాజ్ సినిమా ఛాన్సులపై ప్రభావం చూపింది.

బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రకాష్ రాజ్ కు.. బాలీవుడ్ నుంచి ఆఫర్స్ అందడం లేదు. రేపు ఇదే సీన్ తెలుగులో సాయి కుమార్ కు కూడా ఎదురు కావచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ పర్సన్ అంటే.. ఏపీలో అధికారంలో టీడీపీకి వ్యతిరేకమే అనే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు టీడీపీకి దగ్గరి వ్యక్తులు.. సాయికుమార్ ఎందుకులే అనుకునే అవకాశాలు లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు