వావ్.. ఎంత పని చేశావ్ సోనమ్

వావ్.. ఎంత పని చేశావ్ సోనమ్

సోనమ్ కపూర్ ఓ వారం క్రితం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ కాలంగా ఆనంద్ అహూజాను ప్రేమిస్తున్న ఈమె.. గత వారంలోనే అతగాడితో పెళ్లి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇదంతా పర్సనల్ వ్యవహారం అయితే.. ఇదే సమయంలో తన పెళ్లి పనులతో పాటే ఈ కపూర్ భామ.. తన నెక్ట్స్ మూవీ ప్రచార పనులను కూడా చక్కబెట్టేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడీ కపూర్ బ్యూటీ కేన్స్ లో తేలింది. మరి అంతటి ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరు అవుతోందని తెలిసినప్పటి నుంచి.. సోనమ్ కపూర్ కేన్స్ కు వెళ్ళగానే.. పెళ్లి సందర్భంగా చేతులకు పెట్టుకున్న మెహందీ తుడిచేస్తుందని చాలామంది ఊహించారు. కాని ఎంత ప్రొఫెషనల్ హీరోయిన్ అయినా కూడా.. ఆ పని చేయలేదు. తన చేతులకు ఉన్న మెహందీతో పాటే ఈ కార్యక్రమానికి అటెండ్ అయింది సోనమ్ కపూర్. క్లీవేజ్ సోయగాలు దర్శనం ఇచ్చేలా ఓ డిజైనర్ వేర్ న ధరించిన ఈ బ్యూటీ.. స్లీవ్ లెస్ తో అదరగొట్టింది. బుట్టబొమ్మ మాదిరిగా తయారై వచ్చిన సోనమ్ చేతులకు.. మెహందీ మెరిసిపోతూ కనిపించింది. అర చేతులకు వెనుక వైపు నుంచి మోచేతుల వరకు సోనమ్ కపూర్ చేతులకు ఉన్న ఈ స్పెషల్ మెహందీ.. మరింత ఆకర్షణగా కనిపించింది.

ప్రొఫెషనల్ హీరోయిన్ అనే పేరు ఎంతగా ఉన్నా.. పర్సనల్ గా సెంటిమెంట్స్ కూడా ఈ అమ్మడిలో ఎక్కువే అని ఈ మెహందీ డిజైన్ చెప్పకనే చెబుతోంది. అందుకే చాలామంది ఇప్పుడు సోనమ్ ను తెగ మెచ్చేసుకుంటున్నారు. గ్లామర్ దారబోసినా కూడా.. చేతిపారాణిని కూడా ఆరబోయడం అంటే అది సోనమ్ కే చెల్లింది అంటూ కితాబిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు