అన్నదమ్ముల్ని ఒకేసారి కవర్ చేస్తోంది

అన్నదమ్ముల్ని ఒకేసారి కవర్ చేస్తోంది

ఒకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు.. పలువురు ఇండస్ట్రీలో ఉంటే.. అది కూడా స్టార్ హీరో స్టేటస్ లో ఉంటే.. ఓ హీరోయిన్ దాదాపుగా అందరితోనూ మూవీస్ చేస్తుండడం చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ లో వెలుగులు విరజిమ్మలేకపోయిన ఓ బ్యూటీ.. ఇప్పుడు తమిళంలో బాగానే కుదురుకుంది.

అఖిల్ మూవీతో ఆరంభంలోనే ఫ్లాప్ ఎదుర్కున్న సాయేషా సైగల్.. ఇప్పుడు కోలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసేస్తోంది. ప్రస్తుతం 3 భారీ చిత్రాలు సెట్స్ పై ఉండగా.. ఇవన్నీ 2018లోనే థియేటర్లలోకి వచ్చేయనున్నాయి. విజయ్ సేతుపతితో జుంగా అనే మూవీలో నటిస్తోంది సాయేషా సైగల్. ఘజినీకాంత్ అంటూ తెలుగు మూవీ భలేభలే మగాడివోయ్ ను తమిళ్ లో ఆర్య హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ సాయేషా. కడైకుట్టి సింగం అంటూ కార్తి హీరోగా రూపొందుతున్న చిత్రం కూడా దాదాపుగా పూర్తి అయ్యే స్థితికి వచ్చేసింది. కార్తి సరసన కూడా హీరోయిన్ గా నటిస్తున్న సాయేషా సైగల్.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టును అందుకుంది.

ప్రస్తుతం తమ్ముడు కార్తిని కవర్ చేస్తున్న ఈ భామ.. తన నెక్ట్స్ మూవీలో అన్నయ్య సూర్యకు హీరోయిన్ గా నటించబోతోంది. సూర్య37 అంటూ ప్రారంభం కానున్న చిత్రంలో సూర్యకు జోడీగా సాయేషా ఎంపికయింది. గతంలో వీడొక్కడే.. బ్రదర్స్ వంటి సినిమాలను తీసిన కేవీ ఆనంద్.. ఈ భారీ చిత్రానికి డైరెక్షన్ వహించనున్నాడు. ఈ చిత్రంలో మలయాళీ స్టార్ మోహన్ లాల్.. టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ లు కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు