బన్నీ మళ్ళీ 'డిజె' వాయిస్తున్నాడా??

బన్నీ మళ్ళీ 'డిజె' వాయిస్తున్నాడా??

నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఇంకా థియేటర్ల నుంచి ఈ చిత్రం వసూళ్లను రాబడుతున్నా.. ఇవి మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో కానీ.. సినిమాను సేఫ్ అనిపించే రేంజ్ లో కానీ లేవనే మాట వాస్తవమే. ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతున్న బన్నీకి.. ఈ మూవీ గట్టి షాక్ నే ఇచ్చింది.

ఇప్పుడు తన తర్వాతి చిత్రాల విషయంలో బన్నీ దాదాపుగా ఓ క్లారిటీకి వచ్చేశాడట. మళ్లీ ఇప్పుడప్పుడే ప్రయోగాల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయిపోయాడట. ముఖ్యంగా ఎక్స్ పెరిమెంట్స్.. కొత్త డైరెక్టర్ల విషయంలో ఓ క్లారిటీకి కూడా వచ్చేశాడట. మాస్ ఆడియన్స్ ను కవర్ చేయడంతో పాటు.. ఫ్యామిలీ జనాలను కూడా మెప్పించే ప్రాజెక్టులకే కమిట్ కావాలని నిర్ణయించుకున్నాడట. మళ్లీ హరీశ్ శంకర్ తో ఓ సినిమా చేయాలని బన్నీ భావిస్తున్నట్లుగా టాలీవుడ్ లో తెగ మాటలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ ను దర్శకుడు హరీష్ శంకర్ కలిసి కొన్ని గంటల పాటు చర్చలు జరిపాడట. తనను దృష్టిలో ఉంచుకుని ఓ గ్రిప్పింగ్ స్టోరీ రాయాల్సిందిగా బన్నీ సూచించినట్లుగా చెప్పుకుంటున్నారు.

గతేడాది వచ్చిన డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ వీరిద్దరి కాంబినేషన్ లోనే రూపొందింది. మూవీకి టాక్ తేడాగా వచ్చినా.. హిట్టు పట్టాలు ఎక్కేసి ఓవర్సీస్ మినహా అందరికీ లాభాలు పంచిపెట్టింది. లేటెస్ట్ ఫెయిల్యూర్ ను బేస్ చేసుకుని అడుగులు వేస్తున్న అల్లు అర్జున్.. మళ్లీ ఇప్పుడు మాస్ మసాలా సినిమాయే చేసేందుకే మక్కువ చూపుతున్నట్లు టాక్. చూద్దాం ఏం జరుగుతుందో!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English