అఖిల్ హీరోయిన్ అక్కడ బాగా బిజీ అయిపోయింది

అఖిల్ హీరోయిన్ అక్కడ బాగా బిజీ అయిపోయింది

తెలుగులో చేసిన తొలి సినిమా ‘అఖిల్’తో దారుణమైన ఫలితాన్నందుకుంది ముంబయి భామ సాయేషా సైగల్. హిందీలో ఆమె తొలి చిత్రం ‘శివాయ్’ కూడా డిజాస్టరే. ఈ రెండు చోట్లా ఆమెకు మరో అవకాశం దక్కలేదు. కానీ తమిళ ప్రేక్షకులు మాత్రం బాగానే ఆదరించారు. అలాగని అక్కడ కూడా సాయేషాకు హిట్ ఏమీ దక్కలేదు. ‘అడవిదొంగ’ స్టయిల్లో సాగే ‘వనమగన్’లో ఈ అమ్మాయి అందం, నటన అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

ఇండస్ట్రీ జనాల్ని కూడా ఆకర్షించాయి. దీంతో ఇంకో మూడు సినిమాల్లో సాయేషాకు ఛాన్సులొచ్చాయి. విజయ్ సేతుపతి సరసన ‘జుంగా’.. ఆర్యకు జోడీగా ‘గజినీకాంత్’.. కార్తితో మరో సినిమా చేస్తోంది సాయేషా. ఇప్పుడు ఆమెకు మరో బంపరాఫర్ తగిలినట్లు వార్తలొస్తున్నాయి. సూపర్ స్టార్ సూర్య సరసన సాయేషా నటించబోతోందట.

ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సూర్య.. దీని తర్వాత ‘రంగం’.. ‘వీడొక్కడే’.. ‘బ్రదర్స్’ చిత్రాల దర్శకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో మోహన్ లాల్.. అల్లు శిరీష్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ఇటీవలే వెల్లడైంది. ఇక హీరోయిన్ సంగతేంటో మాత్రమే తేలాల్సి ఉండగా.. సాయేషా పేరు వినిపిస్తోంది.

ఐతే చిన్నమ్మాయిలా కనిపించే సాయేషా.. సూర్య సరసన సెట్టవుతుందా అన్న సందేహాలుు కలుగుతున్నాయి. ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు. హారిస్ జైరాజ్ సంగీతాన్నందించే ఈ చిత్రాన్ని సూర్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తీయబోతున్నారు. ప్రస్తుతం రజినీతో ‘2.0’ సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు