సావిత్రి కూతురు చెప్పిన సంచలన విషయాలు

 సావిత్రి కూతురు చెప్పిన సంచలన విషయాలు

లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రికి సంబంధించి అనేక సందేహాలకు సమాధానాలిచ్చింది ‘మహానటి’ సినిమా. ఈ చిత్రంలో చూపించినవి చాలా వరకు వాస్తవాలే అని.. అక్కడక్కడా కొంత ఎగ్జాజరేషన్ జరిగిందని అంటోంది సావిత్రి తనయురాలు విజయ ఛాముండేశ్వరి. తన తల్లి జీవితానికి సంబంధించి జనాల్లో అనేక అపోహలు ఉన్నాయని.. వాటి గురించి తాను కూడా స్పష్టత ఇవ్వదలుచుకున్నానని ఆమె చెప్పింది.

సావిత్రి చరమాంకంలో అనేక కష్టాలు పడ్డారని.. కానీ ఆమె దివాళా తీశారని.. తమకు ఏమీ మిగల్చలేదనేది వాస్తవం కాదని ఆమె అన్నారు. సావిత్రి చనిపోయే సమయానికి తమకు మూణ్నాలుగు ఇళ్లు మిగిలాయని.. వాటితో తాను.. తన తమ్ముడు స్థిరపడ్డామని ఆమె చెప్పారు. ప్రస్తుతం తాను చెన్నైలో ఖరీదైన ప్రాంతంలో 2500 గజాల విలాసవంతమైన ఫ్లాట్‌లో ఉంటున్నానని ఆమె చెప్పారు. ఇక్కడే నయనతార లాంటి సెలబ్రెటీలు ఉన్నారన్నారు. ఇక తన తమ్ముడు తన వాటాగా వచ్చిన ఆస్తుల్ని అమ్ముకుని అమెరికాకు వెళ్లి సెటిలైపోయాడన్నారు. తన తల్లి ఆస్తుల్ని తండ్రి జెమిని గణేశన్ కాజేశాడన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు.

ఆదాయపు పన్ను అధికారుల దాడుల్లో.. అలాగే బంధువుల వల్ల తన తల్లి ఆస్తులు కోల్పోయినట్లు ఆమె చెప్పారు. చాకలివాళ్లు ఉతకడానికి బట్టలు ఎత్తుకెళ్లినట్లుగా తన తల్లికి చెందిన నగల్ని మూటలుగా బంధువులు.. ఇన్‌కం ట్యాక్స్ అధికారులు ఎత్తుకెళ్లినట్లు ఆమె చెప్పారు. సినిమాలో ఎక్కువగా చూపించలేదు కానీ.. బంధువులు, తెలిసిన వాళ్లు తన తల్లిని మోసం చేశారని ఆమె చెప్పారు. తన తండ్రి ఆమెను బాగానే చూసుకున్నారని.. ఆయన వేరే ఇద్దరు భార్యలతో కూడా సావిత్రితో మంచి అనుబంధం ఉండేదని.. వారి పిల్లలు, తాము చాలా స్నేహంగా ఉండేవాళ్లమని.. ఇరు కుటుంబాల మధ్య రాకపోకలుండేవని.. ఇప్పుడు కూడా తమ మధ్య మంచి సంబంధాలున్నాయని చాముండేశ్వరి వెల్లడించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English