ఇండియన్ బాక్సాఫీస్‌పై అమ్మాయిల ఎటాక్

ఇండియన్ బాక్సాఫీస్‌పై అమ్మాయిల ఎటాక్

లేడీ ఓరియెంటెడ్ సినిమాలంటేనే ఒక చిన్న చూపు ఉండేది ఒకప్పుడు. ఏదో మొక్కుబడిగా సినిమాలు తీసేవాళ్లు. భారీ బడ్జెట్లు పెట్టేవాళ్లు కాదు. వాటికి ఓపెనింగ్స్ సరిగా ఉండేవి కావు. కమర్షియల్ సక్సెస్ అన్నది గగనంగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా భారీ విజయాలందుకున్నాయి. దక్షిణాదిన అనుష్క, నయనతార లాంటి హీరోయిన్లు నటించిన సినిమాలు పెద్ద సక్సెస్ అయ్యాయి.

ఈ కోవలోనే ఇప్పడు ‘మహానటి’ సినిమా కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇందులో తారాగణం భారీగా ఉన్నా.. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా ఉన్నా.. ఇది ప్రధానంగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీనే.  ఈ చిత్రం పెద్ద హీరోల సినిమాలకు దీటుగా వసూళ్లు సాధిస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక తమిళనాడులో కూడా ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుని చక్కటి వసూళ్లు రాబడుతోంది. కర్ణాటకలో తెలుగు వెర్షన్.. కేరళలో తమిళ వెర్షన్‌లకు మంచి స్పందన వస్తోంది.

ఇలా దక్షిణాదిన అంతటా ‘మహానటి’ జోరు సాగుతుండగా.. ఉత్తరాదిన మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ హవా సాగిస్తోంది. అదే.. రాజి. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు నుంచి ఈ చిత్ర వసూళ్లు పెరిగాయి. ఆదివారం ఈ చిత్రం ఏకంగా రూ.14 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.32 కోట్ల దాకా వసూళ్లు రాబట్టి ఆశ్చర్యపరిచింది ‘రాజి’. మొత్తంగా ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ మీద హీరోయిన్లే ఎటాక్ చేస్తుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English