మళ్లీ కాస్త సినిమా లీక్ చేశాడుగా..

మళ్లీ కాస్త సినిమా లీక్ చేశాడుగా..

ఒక్కొక్కరు సినిమాను ప్రమోట్ చేయడానికి ఒక్కొక్క వినూత్న పద్దతి ఫాలో అవుతుంటారు. అందులో కొంతమంది కొత్తరకం ట్రైలర్లతో ప్రమోట్ చేస్తే.. కొందరు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సినిమా గురించి చెప్పించి.. హైప్ తెప్పించేద్దాం అని చూస్తారు. ఇక రామో గోపాల్ వర్మ మాత్రం.. ఒకానొక టైములోమొదటి 15 నిమిషాలు సినిమా బయటకు రిలీజ్ చేసి.. ఇప్పుడు ధియేటర్లకు రండి అంటూ ఛాలెంజ్ చేశాడు. ఈ పద్దతినే మరో హీరో కూడా తెగ ఫాలో అవుతున్నాడు.

తమిళ హీరో విజయ్ ఆంటోని.. 'బిచ్చగాడు' సినిమాతో మంచి హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే ఆ రోజు నుండి మనోడు కొత్త కొత్త కథలను వెతుక్కుంటూ వాటితో సినిమాలను తీస్తున్నాడు కాని.. ఎందుకో అవి హిట్టవ్వట్లేదు. అయితే ఇప్పుడు 'కాశి' అనే సినిమాతో వస్తున్న ఈ హీరో.. ఆ సినిమా తొలి ఏడు నిమిషాలను నెట్ లో లీక్ చేశాడు. అదేలేండి.. ప్రమోషన్ కోసం రిలీజ్ చేశాడు. ఈ దెబ్బకి బజ్ పెరుగుతుందని ఆశిస్తున్నాడు. నిజానికి ఆ ఏడు నిమిషాల సినిమా బాగానే ఉంది. తరువాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠను బాగా మెయిన్టెయిన్ చేశాడు దర్శకుడు కృతిగ ఉదయనిది.

కాకపోతే గతంలో కూడా మనోడు 'భేతాళుడు' సినిమాకు కూడా ఇదే తరహాలో రిలీజ్ చేశాడు. పైగా ఆ సినిమా కూడా పాస్ట్ లైఫ్‌ గురించి తెలుసుకునే కథే. అందుకే ఇప్పుడు విజయ్ ఆంటోని ఈ కొత్త రకం ప్రమోషన్ తో ఏ రకంగా లాభపడతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాని ఒక్కటి మాత్రం నిజం..మనోడు చేసే తరహా సబ్జెక్టులు మన స్టార్ హీరోలు చేస్తే మాత్రం.. భారీ హిట్లే పడతాయ్!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English