ఖాళీల్లేవని అమ్మడు సర్దుకుపోతోందట

ఖాళీల్లేవని అమ్మడు సర్దుకుపోతోందట

సినిమాల్లో పెద్ద తారగా వెలిగిపోవాలని చాలామంది అమ్మాయిలు వస్తుంటారు. వారిలో ఒకరో ఇద్దరో పెద్ద పెద్ద స్టార్లు అవుతారు కాని.. కొందరు మాత్రం కాసేపు మెరిసి తరువాత సర్దేసుకోవాల్సిందే. అయితే అలా కనపించకుండా పోయే బదులు.. చిన్న చిన్న హీరోలతోనైనా సినిమాలు చేసుకుంటూ ఒక హీరోయిన్ గా కొనసాగుదాం అనుకుంటారు కొందరు. అలాంటి బ్యాచీలోకి ఇప్పుడో బ్యూటిఫుల్ లేడీ చేరిపోయింది అంటున్నారు సినిమా లవ్వర్స్.

వచ్చీ రావడంతో ఫ్లాపు సినిమాలో కనిపించినా కూడా, ఆమె యాక్టింగ్ అండ్ లుక్స్ చాలా బాగుండటంతో లావణ్యి త్రిపాఠికి మంచి పేరే వచ్చింది. ఆమెను అందాల రాక్షసి అంటూ అందరూ కొనియాడేశారు. ఆ తరువాత మాత్రం లావణ్య పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమైనా పడుతుంది అనుకుంటే.. ఏంటో ఒక్కటీ ఆమెకు కలసిరాలేదు. పోనివ్ కుర్ర హీరోలతో హిట్లు కొట్టేసి స్టార్ అయిపోతుందా అనుకుంటే.. నాని హిట్టిచ్చినా కూడా ఆ క్రేజ్ అంతా రెండు ఫ్లాపులతో నాగ చైతన్య అండ్ సాయిధరమ్ తేజ్ గ్రౌండ్ లెవెల్ కు తెచ్చేశారు. దానితో ఛాన్సుల కోసం వెయిటింగ్ చేయక తప్పట్లేదు.

అయితే వరుణ్‌ తేజ్ చేస్తున్న వ్యోమగామి (వర్కింగ్ టైటిల్) సినిమాలో అమ్మడు సెకండ్ హీరోయిన్ గా మెరవనుంది. ఇదే సమయంలో కుర్ర హీరో నిఖిల్ తో ఒక సినిమా చేయడానికి ఒప్పేసుకుంది. కనితన్ రీమేకులో మొదటి నుండీ నిఖిల్ సరసన తమిళ మాతృకలో చేసిన క్యాథరీన్ త్రెసా హీరోయిన్ గా చేస్తుంది అనుకుంటే.. లాస్ట్ మినిట్ లో బడ్జెట్ చాలా తక్కువగా చెప్పడంతో లావణ్యను తీసుకున్నారట. మరి ఛాన్సులు లేవు.. పెద్ద హీరోల పక్కన ఖాలీల్లేవు.. ఇప్పుడేచేస్తుంది.. దొరికిన వాటిని పట్టేసి సర్దుకుపోతోంది అంటున్నారు జనాలు. ఏదేమైనా ఒక్క హిట్టు పడితే మాత్రం లావణ్య ఫేట్ మారుతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English