మిల్కీ ఆ వీడియో ఎందుకు పెట్టిందంటే..

మిల్కీ ఆ వీడియో ఎందుకు పెట్టిందంటే..

మిల్కీ బ్యూటీ తమన్నా అంటే స్టార్ హీరోయిన్(కొన్నేళ్ల క్రితం లెండి). బోలెడంత మంది అభిమానులున్నారు. పలు భాషల్లో సినిమాలు చేసి.. దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని.. గ్లామర్ వరల్డ్ లో బోలెడంత మంది ఫాలోయర్స్ ను క్రియేట్ చేసుకుంది.

అలాంటి ఈ భామ.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. ఓ పాప్ ఆల్బంకు తమ్ము తెగ డ్యాన్స్ చేసేసి.. నెట్ లో పోస్ట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. తమన్నా లాంటి హీరోయిన్ కు ఇలా ప్రైవేటు సాంగ్స్ కు డ్యాన్స్ చేసి నెట్ లో పెట్టడం నిజంగా షాక్ కలిగించే విషయం. అప్ కమింగ్ హీరోయిన్లు.. అవకాశాలు లేని భామల మాదిరిగా.. తమన్నాకు కూడా ఇలాంటి అవసరం వచ్చిందా.. ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోయిందా అనుకున్నారు చాలా మంది.

నిజానికి మాజెంటా రిడిమ్ సాంగ్ ను హైద్రాబాద్ లోనే షూట్ చేశారు. డీజేస్నేక్ గా గుర్తింపు పొందిన ఫ్రెంచ్ డీజే.. తమన్నాకు మాజెంట్ రిడిమ్ ఛాలెంజ్ విసిరాడు. దీనికి సమాధానంగానే తమ్మూ ఇలా డ్యాన్స్ వీడియో పోస్ట్ చేసింది. దీనికి డీజే స్నేక్ నుంచి సూపర్బ్ అంటూ రియాక్షన్ కూడా వచ్చింది. తమన్నా డ్యాన్స్ వీడియో వెనక అంత కథ ఉంది మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English