పోస్టర్ బాగున్నా.. పోలిక తప్పట్లేదు

పోస్టర్ బాగున్నా.. పోలిక తప్పట్లేదు

యంగ్ హీరో రామ్ కు హిట్టు వచ్చి రెండేళ్లు దాటిపోయింది. వరుస ఫ్లాపుల తర్వాత నేను.. శైలజ మూవీతో తిరిగి ఫామ్ లోకి వచ్చిన రామ్.. ఆ తర్వాత చేసిన రెండు సినిమాలు పల్టీ కొట్టేశాయి. చివరగా వచ్చిన ఉన్నది ఒకటే జిందగీపై రామ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడు కానీ.. ఇవి నెరవేరలేదు.

ప్రస్తుతం నేను లోకల్ ఫేమ్ దర్శకుడు నక్కిన త్రినాథరావుతో ఓ సినిమా చేస్తున్నాడు రామ్. దిల్ రాజు నిర్మాణం కావడంతో ఆసక్తి బాగానే ఉండగా.. 'హలో గురూ ప్రేమ కోసమే' అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ను పెట్టడం మరింతగా ఆకట్టుకుంది. ఇప్పుడీ చిత్రానికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రేపు(మే 25) రామ్ పుట్టిన రోజు సందర్భంగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్పెషల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. ఎనర్జిటిక్ హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కావడంతో ఆసక్తి బాగానే జనరేట్ అయింది. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ముందు పుస్తకాలు పట్టుకుని నడుస్తూ ఉంటే.. వెనకాల హీరో రామ్ తనదైన స్టైలింగ్ తో నడుచుకుంటూ స్మైల్ ఇస్తూ రావడం ఈ పోస్టర్ లో కనిపిస్తుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది.

కాని హలో గురూ ప్రేమ కోసమే ఫస్ట్ లుక్ పోస్టర్ ను చూడగానే.. నేను శైలజ మూవీ పోస్టర్ గుర్తుకు వచ్చిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. దాదాపుగా డిట్టో ఇట్టాంటి పోస్టర్ ఒకటి ఆ చిత్రానికి కూడా ఇచ్చారు. ఇప్పుడు కొత్త సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ అంటే.. అసలే అందరూ వినూత్నంగా ఏదోకటి చేస్తున్నారు కాబట్టి.. రామ్ కూడా అలాగే చేసుంటే బాగుండేది. కాని తన పాత పోస్టర్ల తరహాలోనే ఉండటంతో.. పోలిక పెట్టి మరీ నెటిజన్లు రఫ్ఫాడిస్తున్నారు. మరి సినిమాలో ఎలాంటి కొత్తదనం ఉంటుందో చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English