ఎన్టీఆర్ మూవీతో మాజీ హీరోయిన్ రీఎంట్రీ

ఎన్టీఆర్ మూవీతో మాజీ హీరోయిన్ రీఎంట్రీ

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిపోయిన భామ విజయలక్ష్మి అలియాస్ రంభ. అప్పట్లో టాప్ హీరోలు అందరితోనూ వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తర్వాత మెల్లగా బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. దేశముదురు.. యమదొంగ చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించిన రంభ.. 10 ఏళ్ల క్రితం వచ్చిన దొంగ సచ్చినోళ్లు అనే మూవీలో చివరగా కనిపించింది.

దాదాపు ఏడేళ్ల నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా క్రేజీ ప్రాజెక్టుతో రంభ మళ్లీ తిరిగి సినిమాల్లోకి ప్రవేశించనుంది. తన సినిమాల్లో సీనియర్ భామలకు స్పెషల్ క్యారెక్టర్లు ఇచ్చి ఆకట్టుకుంటున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి.. ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే- హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలను రూపొందిస్తున్నారు.

రీసెంట్ గా రంభకు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఎన్టీఆర్ మూవీ ఆఫర్ గురించి చెప్పాడట. సినిమాకు కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం అయితే.. ఈ సీనియర్ బ్యూటీ సరిగ్గా సరిపోతుందని చెప్పాడట. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో రీఎంట్రీ ఇవ్వడం కంటే.. మంచి అవకాశం మళ్లీ అందకపోవచ్చనే ఉద్దేశ్యంతో.. రంభ కూడా వెంటనే సైన్ చేసేసినట్లు తెలుస్తోంది. జూన్ రెండో వారం నుంచి రంభ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు