ఇప్పుడు గ్లామరంటే వర్కవుట్ అవుతుందా

ఇప్పుడు గ్లామరంటే వర్కవుట్ అవుతుందా

టాలీవుడ్ అమ్మాయి శ్రీదివ్య తెలుసు కదా.. మనసారా అంటూ మనల్ని పలకరించిన ఈ భామ.. ఆ తర్వాత కుర్రాళ్లను కేరింతలు కొట్టించేందుకు గట్టిగానే ట్రై చేసింది. బస్టాప్ చేసింది.. అలాగే మల్లెల తీరంలో సిరిమల్లెపువ్వు గా మారింది.  ఇన్ని చేసినా పెద్దగా దక్కిన ప్రయోజనం ఏమీ లేదు. అలాగే ఆ తర్వాత అవకాశాలు కూడా అందక.. మెల్లగా తన బేస్ ను ఇక్కడి నుంచి కోలీవుడ్ కి మార్చేసింది. ఈ స్టెప్ అమ్మడికి బాగానే వర్కవుట్ అయిందిలే.

సాంబార్ ల్యాండ్ లో వరుస సినిమాలు చేసేసి మంచి ఇమేజ్ ను దక్కించుకుంది. ఇప్పుడీ భామ కళ్లు మళ్లీ టాలీవుడ్ మీద పడ్డాయి. టాలీవుడ్ సినిమాలకు అవసరమైన గ్లామర్ రోల్స్ కూడా చేస్తానంటూ ఫీలర్లు ఇస్తోంది. ఇదే ఆశ్చర్యకరమైన విషయంగా చెప్పాలి. అరంగేంట్రం చేసిన కొత్తల్లో ఏమైనా అందాల ఆరబోత క్యారెక్టర్లు చేస్తే.. క్రేజ్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. చేతులు కాలాక.. ఆకులు పట్టుకున్నట్లు.. ఇన్నేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడొచ్చి గ్లామ్ రోల్స్ అనడం కాసింత కామెడీగా ఉందంటున్నారు టాలీవుడ్ జనాలు. మరి అమ్మడు ఇస్తున్న ఆఫర్ ను ఎవరు ఉపయోగించుకుంటారో చూడాలి.

అయితే ఇప్పుడు శ్రీదివ్య తరహాలోనే అంజలి.. బింధు మాదవి వంటి భామలు కూడా.. తమిళంలో చేతిలో ఉన్న ఆఫర్లన్నీ అయిపోవడంతో.. అక్కడ కూడా వీరు స్టార్ హీరోయిన్లుగా ఇంకా సెట్టవ్వకపోవడంతో.. మరోసారి తెలుగు సముద్రంలో వలలు వేస్తున్నారు. మాంచి సొరచేపలవంటి ఆఫర్లు పడకపోయినా.. చిన్ని చిన్ని చేపలువంటివి అయినా పడతాయి కదా అని. కాని ఇప్పుడున్న టఫ్‌ కాంపిటీషన్లో అది కుదిరే పనేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు