రంగస్థలం.. ఒక్క థియేటర్లోనే 2 కోట్లు

రంగస్థలం.. ఒక్క థియేటర్లోనే 2 కోట్లు

‘రంగస్థలం’ విడుదలైన నెలన్నర దాటింది. ఇంకా ఆ సినిమా వార్తల్లో నిలుస్తోంది. ముందుగా  జరిగిన ఒప్పందం ప్రకారం ఈ రోజు అమేజాన్ ప్రైమ్‌లో ఆ చిత్రాన్ని రిలీజ్ చేశారు కూడా. కానీ  ఇప్పటికీ ఈ చిత్రం వారాంతాల్లో చెప్పుకోదగ్గ వసూళ్లతో సాగుతోంది. బహుశా దర్మక నిర్మాతలు కూడా  ఈ చిత్రం ఇలా ఆడుతుందని ఊహించి ఉండకపోవచ్చు.

నెల తర్వాత థియేటర్లలో సినిమా ఉనికి  కనిపించడం కష్టం కాబట్టి ఈ గ్యాప్ పెట్టుకుని అమేజాన్‌లో రిలీజ్ చేయడానికి ఒప్పందం  కుదుర్చుకుని ఉండొచ్చు. కానీ అంచనాల్ని మించిపోయి ఆడేస్తున్న ‘రంగస్థలం’.. వసూళ్ల  మోతను కొనసాగిస్తోంది. ‘భరత్ అనే నేను’.. ‘నా పేరు సూర్య’.. ‘మహానటి’ లాంటి  సినిమాల పోటీని తట్టుకుని ఇంకా కూడా ఆడుతుండటం మామూలు విషయం కాదు.

మొదట్లో ‘మగధీర’ వసూళ్లను ఈ చిత్రం దాటడాన్నే గొప్పగా చెప్పుకున్నాం. తర్వాత అది ‘ఖైదీ  నంబర్ 150’ పేరిట ఉన్న నాన్-బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. ఆపై ఏకంగా రూ.115 కోట్ల  షేర్ మార్కును దాటింది. ఇప్పుడు రూ.120 కోట్ల మార్కుపై కన్నేసింది. ఈ చిత్రం కేవలం ఒక  థియేటర్లోనే రూ.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే దిశగా సాగుతుండటం విశేషం. హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 35 ఎంఎం థియేటర్లో ‘రంగస్థలం’ గ్రాస్ రూ.2 కోట్లకు చేరువగా ఉంది.

ఇప్పటిదాకా ఒక్క ‘బాహుబలి: ది కంక్లూజన్’ మాత్రమే ఈ ఘనత సాధించింది. అది స్పెషల్ మూవీ కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ ‘రంగస్థలం’ కూడా ఈ ఘనతను అందుకోవడమంటే మాటలు కాదు. ఒక్క థియేటర్లో రూ.2 కోట్ల వసూళ్లన్నది నమ్మశక్యం కాని విషయం. ఎనిమిదో వారంలో ఉన్న ఈ చిత్రం ఒక్క వీకెండ్ డేలో రూ.3 లక్షల దాకా గ్రాస్ వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు