ఇద్దరమ్మాయిలతో అన్నమయ్య!!!

ఇద్దరమ్మాయిలతో అన్నమయ్య!!!

హెడ్డింగ్‌ చూసి బూతు అనుకోవద్దు, మేము చెప్తుంది జస్ట్‌ సినిమాల గురించే. ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఇద్దరమ్మాయిలతో'. ఎప్పుడు వస్తుందో తెలియదుకాని, ఇప్పుడు మరో కొత్త డేటు మార్కెట్లో వినిపిస్తోంది. మే 11 నుండి వెనక్కి జరుపుకుంటూ నిర్మాత గణేష్‌, ఎట్టకేలకు సినిమాను మే 31 న రిలీజ్‌ చేస్తాడని తెలుస్తోంది.

అయితే ఈ విషయం కన్‌ఫామ్‌ కాలేదుకాని, ఇదే రోజున నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న తన కొడుకు రేవంత్‌ హీరోగా 'ఇంటింట అన్నమయ్య' సినిమాను విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. ఒకవేళ అదే రోజున ఇద్దరమ్మాయిలతో సినిమా ఖచ్చితంగగా రిలీజయితే మాత్రం, అన్నమయ్యకు కాస్త కష్టమే.

ఎంత రాఘవేంద్రరావు సినిమా అయినా, కొత్త హీరో అంటే మనోళ్ళకు ఫస్ట్‌ డే ఎగబడి చూసేటంత అలవాటు లేదుగా. ఇక అటుప్రక్కన అల్లు అర్జున్‌ సినిమా వస్తుందంటే, ఖచ్చితంగా సినిమా లవర్స్‌ అందరూ ఆ ధియేటర్ల దగ్గరే కాపుకాస్తుంటారు. మరి చూద్దాం రెండు సినిమాలు విడుదలైతే సీన్‌ ఎలా ఉంటుందో...

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు