ఒట్టు.. సమ్మోహనం అస్సలు కాపీ కాదు

ఒట్టు.. సమ్మోహనం అస్సలు కాపీ కాదు

ట్యాలెంటెడ్ ఫిలిం మేకర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ మూవీ సమ్మోహనం. సుధీర్ బాబు హీరోగా.. అదితి రావ్ హైదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి.. ఇప్పటికే టీజర్ విడుదల చేశారు. ఫిలిం యాక్ట్రెస్ పాత్రలో అదితి.. సినిమా పరిశ్రమపై అంతగా సదభిప్రాయం లేని వ్యక్తి పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్న విషయం టీజర్ లో చెప్పేశారు.

విజువల్ పరంగా ఈ టీజర్ బాగా ఆకట్టుకుంది కానీ.. హాలీవుడ్ మూవీ ''నాటింగ్ హిల్''కు.. సమ్మోహనం ఫ్రీ మేక్ అనే కామెంట్లు వినిపించాయి. కథ చూస్తే మరి అచ్చం అలాగే ఉంది కూడాను. ఈ కామెంట్స్ పై ఇప్పుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ రియాక్ట్ అయ్యాడు. తన సినిమా ఏ ఇతర చిత్రానికి కాపీ కాదని.. 2011లో వచ్చిన ఓ ఆలోచనకు కథా రూపం ఇచ్చి రూపొందిస్తునట్లు చెప్పుకొచ్చాడు. సింపుల్ సన్నివేశాలు తనకు నచ్చుతాయని.. అలాంటివాటి చుట్టూ కథనం రాసుకుంటున్నానని అన్నాడు ఇంద్రగంటి. తన సినిమాను నాటింగ్ హిల్ తో పోల్చడాన్ని కాపీ అనే ఆరోపణలా కాకుండా.. ఓ కాంప్లిమెంట్ గా తీసుకుంటానని చెప్పి ఆశ్చర్యపరిచాడు ఈ దర్శకుడు.

విభిన్నమైన జోనర్స్ ను టచ్ చేయడం ఇంద్రగంటికి అలవాటు. ఇప్పుడు కొన్నేళ్లుగా దగ్గరగా చూస్తున్న.. చూస్తున్న ఫిలిం ఇండస్ట్రీపైనే సినిమా తీస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది. జోనర్ ఎలా ఉన్నా.. తన సినిమాలో ఉండే ఫన్ ఎలిమెంట్ ను మాత్రం ఈసారి కూడా కంటిన్యూ చేస్తానని చెబుతున్నాడు ఇంద్రగంటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు