ఆ విజయ్ డ్రాప్.. ఈ విజయ్ బరిలోకి

ఆ విజయ్ డ్రాప్.. ఈ విజయ్ బరిలోకి

సినిమాలకు తిరుగులేని వసూళ్లుండే సీజన్ సమ్మర్. ఇలాంటి సీజన్ మధ్యలో ఒక వారంలో కొత్త సినిమాలేవీ లేకుండా ఖాళీగా వదిలేయడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ వీకెండ్లో అదే జరగబోతోంది. ముందు ఈ వారానికి అనుకున్న సినిమాలేవీ రావట్లేదు. గోపీచంద్ ‘పంతం’తో పాటు విజయ్ దేవరకొండ ‘ట్యాక్సీవాలా’ మే 18న రావాల్సింది. ఐతే గోపీ సినిమా చాలా ముందే రేసు నుంచి తప్పుకుంది. విజయ్ దేవరకొండ మూవీ పది రోజుల ముందు వరకు పోటీలో ఉంది కానీ..వీఎఫెక్స్ పనుల్లో జాప్యం వల్ల వాయిదా వేసేశారు. ఈ రోజు ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ధ్రువీకరించాడు. తమ సినిమా జూన్లో రిలీజవుతుందని.. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పాడతను.

ఆ విజయ్ రేసు నుంచి తప్పుకోగా.. మరో విజయ్ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు ఈ వారాంతంలో. అతనెవరో కాదు.. ‘బిచ్చగాడు’తో సూపర్ పాపులారిటీ సంపాదించిన విజయ్ ఆంటోనీ. అతడి కొత్త సినిమా ‘కాశి’ తమిళ.. తెలుగు భాషల్లో ఒకేసారి మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘బిచ్చగాడు’తో వచ్చిన గుర్తింపును విజయ్ నిలబెట్టుకోలేకపోయాడు. బేతాళుడు.. యమన్.. ఇంద్రసేన.. ఇలా వరుసగా అతడి సినిమాలు తేడా కొట్టేశాయి. వచ్చిన మార్కెట్ అంతా పోయింది. ‘కాశి’ గురించి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. కాకపోతే ఈ వారం వేరే సినిమాలేవీ కాబట్టి ఇదేమైనా ప్రభావం చూపుతుందేమో చూడాలి. దీనికి తోడుగా ఇంగ్లిష్ డబ్బింగ్ మూవీ ‘డెడ్ పూల్-2’ కూడా రిలీజవుతోంది ఈ వారాంతంలో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు