ఫస్ట్ లుక్: స్మార్ట్ రామ్.. క్యూట్ అనుపమ

ఫస్ట్ లుక్: స్మార్ట్ రామ్.. క్యూట్ అనుపమ

‘నేను శైలజ’తో వచ్చిన విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు యువ కథానాయకుడు రామ్. అతడి తర్వాతి సినిమాలు ‘హైపర్’.. ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంచనాల్ని అందుకోలేకపోయాయి. నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు రామ్ ఆశలన్నీ ‘నేను లోకల్’ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హలో గురూ ప్రేమ కోసమే’ మీదే ఉన్నాయి. మంచి టైటిల్ తో ఇప్పటికే ఆకర్షించిన ఈ చిత్రం.. ఈ రోజు ఫస్ట్ లుక్ తో పలకరించింది.

తెలుగులో ఉన్న అత్యంత స్మార్ట్ హీరోల్లో ఒకడైన రామ్.. ఆ అందం సరిగ్గా ఎలివేట్ లుక్స్ లో కనిపించింది తక్కువ. ఐతే ‘హలో గురూ ప్రేమ కోసమే’లో మాత్రం రామ్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. గడ్డం తీసేసి.. క్రాఫ్ సరి చేసుకుని.. ఫార్మల్ డ్రెస్సుల్లో చాలా పద్ధతిగా.. అందంగా కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఎప్పట్లాగే క్యూట్ లుక్ తో చంపేస్తోంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ కూల్ గా కనిపిస్తోంది. ఐతే ఫస్ట్ లుక్ లో కొత్తదనం అయితే ఏమీ కనిపించడం లేదు.

మామా అల్లుళ్ల గొడవ నేపథ్యంలో సాగే ‘సినిమా చూపిస్త మావ’తో సక్సెస్ అందుకున్న త్రినాథరావు.. ఆ తర్వాత అదే స్టయిల్లో ‘నేను లోకల్’ తీశాడు. ‘హలో గురూ..’ కూడా ఇదే స్టయిల్లో ఉంటుందన్న వార్తలొస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ రామ్ మామ పాత్ర చేస్తున్నాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ఈ మధ్య డిస్ట్రిబ్యూషన్లో వరుసగా చేతులు కాల్చుకుంటున్న రాజుకు ఈ చిత్రం విజయవంతం కావడం చాలా కీలకం. హీరో రామ్.. హీరోయిన్ అనుపమలకు కూడా ఇది హిట్టవడం అత్యావశ్యకం. మరి వీళ్లందరి కోరికను ‘హలో గురూ..’ తీరుస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English