ఆ హీరోయిన్ని పోషిస్తోన్న నిర్మాణ సంస్థ

ఆ హీరోయిన్ని పోషిస్తోన్న నిర్మాణ సంస్థ

కొత్త హీరోయిన్‌ ఎవరైనా దొరకగానే వారితో కనీసం మూడు సినిమాలకి ఒప్పందం చేసుకోవడం యష్‌రాజ్‌ సంస్థకి అలవాటు. వాణి కపూర్‌తో కూడా అలాగే వాళ్లు మూడు చిత్రాలకి ఒప్పందం చేసుకున్నారు. బేఫిక్రే సినిమాతో ఆమె మూడు సినిమాల డీల్‌ పూర్తయింది. అయితే వెంటనే డీల్‌ని పొడిగిస్తూ ఆమెతో మరో మూడు చిత్రాలకి ఒప్పందం చేసుకున్నారు. ఇంతవరకు చేసిన మూడు సినిమాలతో వాణి కపూర్‌కి ఎలాంటి క్రేజ్‌ రాకపోయినా కానీ యష్‌రాజ్‌ సంస్థ సౌజన్యంతో ఆమెకి మరో మూడు భారీ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి.

హృతిక్‌ రోషన్‌తో ఒకటి, టైగర్‌ ష్రాఫ్‌తో మరొకటి ఇటీవలే సైన్‌ చేసిన వాణికి తాజాగా రణ్‌భీర్‌ కపూర్‌తో యష్‌రాజ్‌ నిర్మించే చిత్రంలోను హీరోయిన్‌ రోల్‌ దక్కింది. ఈ మూడు సినిమాల తర్వాత అయినా ఆమె పాపులారిటీ సాధిస్తుందేమో చూడాలి. దీపిక, ప్రియాంక లాంటి అగ్ర హీరోయిన్లు అంతర్జాతీయ మార్కెట్‌ మీద మోజు పడుతూ వుండడంతో బాలీవుడ్‌లో హీరోయిన్ల కొరత ఏర్పడింది. దీంతో వాణి కపూర్‌లాంటి ఫెయిల్డ్‌ ఆర్టిస్టులకి సయితం టైమ్‌ కలిసి వస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు