దత్తుగారి జాతకం నిజమయింది

దత్తుగారి జాతకం నిజమయింది

అశ్వనీదత్‌ అంటే ఒకప్పుడు భారీ చిత్రాలకి పెట్టింది పేరు. ఎన్నో విజయవంతమైన చిత్రాలని అందించిన అశ్వనీదత్‌కి ఆ తర్వాత బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయింది. వరుసపెట్టి భారీ పరాజయాలు చవిచూసారు. ఒక్క శక్తి చిత్రం మీదే ఆయనకి ముప్పయ్‌ కోట్ల నష్టం వచ్చిందట. దాంతో ఆయన సినిమా నిర్మాణానికి దూరమయ్యారు. మహేష్‌, చరణ్‌, ఎన్టీఆర్‌ తదితర హీరోల డేట్స్‌ తన వద్ద వున్నా కానీ ఆయన సినిమాలు నిర్మించకుండా సైలెంట్‌గా వుండిపోయారు. ఆయన జాతకం ప్రకారం 2018 వరకు ఏమి తీసినా కానీ నష్టాలు తప్పవని చెప్పారట. దాంతో అంతవరకు వేచి చూడాలని ఆయన నిర్ణయించుకున్నారు. మధ్యలో వేరే బ్యానర్‌పై ఆయన కూతుళ్లు తీసిన సినిమాలు కూడా ఏమంత ఆడలేదు.
2018 నుంచి మంచి టైమ్‌ స్టార్ట్‌ అవుతుందని జ్యోతిష్యులు చెప్పడంతో మహేష్‌తో సినిమాని ఈ యేడాదిలోనే మొదలు పెడుతున్నారు.

శుభసూచకంగా మహానటి చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. వైజయంతి మూవీస్‌ సంస్థకి మళ్లీ పూర్వ వైభవాన్ని, ప్రతిష్టని తెచ్చే విధంగా ఇది అద్భుత విజయాన్ని, ప్రశంసలని అందుకుంటోంది. జాతకం నిజమైందనే ఆనందంతో మహేష్‌ చిత్రాన్ని మరింత ఉత్సాహంతో ముందుకి నడిపిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్‌తో పెండింగ్‌లో వున్న సినిమాని కూడా పట్టాలెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌ మరో రెండేళ్ల వరకు దొరకడు కనుక అతను ఫ్రీ అయ్యేలోగా ఆ చిత్రానికి అన్నీ సిద్ధం చేసి వుంచాలని చూస్తున్నారు. అశ్వనీదత్‌ లాంటి నిర్మాత మళ్లీ ట్రాక్‌ మీదకి రావడంతో తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English