అఖిల్‌ కష్టం వేస్ట్‌ అవలేదు

అఖిల్‌ కష్టం వేస్ట్‌ అవలేదు

హలో మంచి చిత్రంగా ప్రశంసలు అందుకున్నా కానీ అఖిల్‌కి విజయాన్ని అందించలేకపోయింది. రెండవ సినిమా కోసం చాలా సమయం వేచి చూసి హలోని సైన్‌ చేసిన అఖిల్‌ ఆ చిత్రంలో స్టంట్స్‌ కోసం చాలా కష్టపడ్డాడు. తెలుగు సినిమా తెరపై చూడని వైవిధ్యమైన స్టంట్స్‌ ఈ చిత్రంలో చూపించారు. బిల్డింగుల మీద నుంచి దూకుతూ అత్యంత క్లిష్టమైన ఫైట్స్‌ని అఖిల్‌ చాలా బాగా చేసాడు. అయితే అతని కష్టం బాక్సాఫీస్‌ పరంగా ఫలించలేదు. పెట్టిన డబ్బులో నాగార్జునకి సగానికి పైగా నష్టమొచ్చింది. దీంతో అఖిల్‌ మూడవ చిత్రానికి భారీ హంగులేమీ లేకుండా మామూలుగా తీసేస్తున్నారు.

అయితే హలోకి పడ్డ కష్టం పూర్తిగా వృధా అవకుండా ఆ చిత్రానికి ప్రత్యేక గుర్తింపు దక్కింది. వరల్డ్‌ స్టంట్‌ అవార్డ్స్‌లో ఫారిన్‌ ఫిలిం కేటగిరీలో హలో నామినేట్‌ అయింది. ఒక తెలుగు చిత్రం ఇలా వరల్డ్‌ స్టేజ్‌పై గుర్తింపు తెచ్చుకోవడం చిన్న విషయమేం కాదు. మన సినిమాల్లో అసహజంగా వుండే ఫైట్లని విదేశీ సంస్థలు గుర్తించడం జరిగే పని కాదు. వరల్డ్‌ క్లాస్‌ స్టంట్స్‌ వున్నాయి కనుకే హలో ఇక్కడ నామినేట్‌ కాగలిగింది. ఈ అవార్డుని హలో గెలుచుకున్నా లేకపోయినా కానీ నామినేట్‌ అవడంతోనే ఈ చిత్రం తెలుగు సినిమాని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టినట్టయింది. అంతగా పడ్డ కష్టానికి ఇదో కన్సొలేషన్‌ అని విక్రమ్‌ కుమార్‌, అఖిల్‌ ఆనందపడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు