మెగాస్టార్ తోనే కాదు.. ఎన్టీఆర్ తో కూడా..

మెగాస్టార్ తోనే కాదు.. ఎన్టీఆర్ తో కూడా..

వైజయంతీ మూవీస్ బ్యానర్ స్టాండర్డ్స్ ఏంటో ఈ జనరేషన్ ఆడియన్స్ కు అంతగా తెలియకపోవచ్చు. వీరికి మహానటి మూవీ ద్వారా ఓ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మహానటి విజయం ఇచ్చిన జోష్ మామూలుగా లేదు. అందుకే అశ్వినీదత్ తన మరుసటి సినిమాల విషయంలో స్పీడ్ చూపించేయాలని ఫిక్స్ అయిపోయారు.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సినిమాకు అశ్వినీదత్ కూడా ఓ నిర్మాత. అయితే.. తనే స్వయంగా మళ్లీ భారీ చిత్రాలకు ప్రాజెక్టులు రెడీ చేయించేస్తున్నారు. ప్రస్తుతం సైరా చిత్రాన్ని చేస్తున్నారు చిరంజీవి. దాని తర్వాత కొత్త ప్రాజెక్టు ఏదీ ఇంకా కమిట్ కాలేదు. ఆ సమయాని కల్లా తన అల్లుడు నాగ్ అశ్విన్ తో కథ సిద్దం చేయించేసి.. చిరంజీవితో సినిమా మొదలుపెట్టేయాలని చూస్తున్నారట అశ్వినీదత్. కథ బాగుంటే వేరే దర్శకుడితో అయినా సరే.. మెగాస్టార్ తో మూవీ మాత్రం ఖాయం అని తెలుస్తోంది.  అయితే.. ఈయన ప్లానింగ్ ఏమీ ఇక్కడితో ఆగిపోలేదట.

మరోవైపు ఎన్టీఆర్ తోనూ ఓ సినిమాకు సిద్ధం అవుతున్నట్లు అశ్వినీదత్ చెప్పారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులతో కూడా స్టోరీ విషయమై చర్చలు జరుపుతున్నామని అన్నారు అశ్వినీదత్. ఒకవైపు చిరంజీవి.. మరోవైపు ఎన్టీఆర్ లతో సినిమా అంటే అశ్వినీదత్ మళ్లీ ఫుల్లు ఫామ్ లోకి వచ్చేసినట్లే అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆల్రెడీ దిల్ రాజుతో కలసి మహేష్‌ బాబుతో వంశీ పైడిపల్లి డైరక్షన్లో సినిమాను రూపొందిస్తుండటం చూస్తుంటే.. వరుసగా మూడు భారీ సినిమాలతో మరోసారి తన భారీ రేంజును దత్తుగారు ప్రూవ్ చేస్తున్నట్లుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English