టాలీవుడ్ ని తిట్టి బాలీవుడ్ లో పార్టీలు

టాలీవుడ్ ని తిట్టి బాలీవుడ్ లో పార్టీలు

కొందరు హీరోయిన్లు టాలీవుడ్ లో సినిమాలు చేసుకుంటూ.. మన దగ్గర పేమెంట్లు బాగా ఉంటాయి కాబట్టి బాగానే సంపాదించుకుంటూ.. అదే సమయంలో బాలీవుడ్ ట్రయల్స్ వేసుకుంటూ కెరీర్ సాగించి.. అక్కడ కొన్ని అవకాశాలు దక్కించుకుని.. కాసింత గుర్తింపొచ్చాక.. తెలుగు సినిమాను తిట్టిపోయడం చూస్తూనే ఉంటాం.

ఈ విషయంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ అయితే.. ఢిల్లీ భామ తాప్సీ పన్ను. తెలుగులో సినిమా ఉన్నపుడు సైలెంట్ అవుతూ.. ముంబైలో ఈ భామ గురించి వార్తలు రావడం ఆగిపోతే.. వెంటనే టాలీవుడ్ ను కామెంట్స్ చేస్తూ.. న్యూస్ లో బాగానే నానిన ఈ భామ.. ఇప్పుడు ముంబై పార్టీల్లో ఇదుగో ఇలా చక్కర్లు కొడుతోంది. తనను టాలీవుడ్ లో కేవలం సెక్సీ ఇమేజ్ కోసమే వాడుకున్నారని వాపోయిన ఈ భామ.. చిట్టి పొట్టి బట్టలతో పార్టీలను చుట్టేస్తోంది.

ప్రస్తుతం బాలీవుడ్ ట్రయల్స్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు తాప్సీ పన్నుకు జత అయింది. కాకపోతే రకుల్ కి తాప్సీకి తేడా ఏంటంటే.. ఇంకా టాలీవుడ్ ని తిట్టకపోవడమే. ఆ మధ్యన టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంతగా లేదంటూ కామెంట్స్ చేసి తిట్లు కూడా తింది రకుల్ ప్రీత్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English