జీవితా రాజ‌శేఖ‌ర్.. ప‌వ‌న్ ఫ్యాన్స్ పై శ్రీ‌రెడ్డి ఫిర్యాదు

జీవితా రాజ‌శేఖ‌ర్.. ప‌వ‌న్ ఫ్యాన్స్ పై శ్రీ‌రెడ్డి ఫిర్యాదు

కొన్ని వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నాల మీద సంచ‌ల‌నాలు సృష్టించిన సినీ న‌టి శ్రీ‌రెడ్డి కొద్దిరోజులుగా మీడియాలో క‌నిపించ‌టం లేదు. క్యాస్టింగ్ కౌచ్ తో పాటు మా సంస్థ‌లో స‌భ్య‌త్వం ఇవ్వాలంటూ పోరాడిన ఆమెకు కొన్ని టీవీ ఛాన‌ళ్లు ప్ర‌యారిటీ ఇవ్వ‌టం.. ఆ ఇష్యూపై వారాల‌కు వారాలు గంట‌ల కొద్దీ చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం తెలిసిందే.

అయితే.. ఈ ఇష్యూ అటుఇటు తిరిగి చివ‌ర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను టార్గెట్ చేసేలా జ‌ర‌గటం.. ఆయ‌న ఎంట్రీతో మొత్తం ఇష్యూ రూపురేఖ‌లు మారిపోయాయి.

శ్రీ‌రెడ్డి మొద‌లెట్టిన క్యాస్టింగ్ కౌచ్ పోరాటం.. త‌ర్వాతి ద‌శ‌లో కొన్ని మీడియా సంస్థ‌లు వ‌ర్సెస్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లా మారటం.. ఇది మ‌రింత ముదిరితే ఇరువురికి న‌ష్ట‌మ‌న్న వాద‌న రెండు వ‌ర్గాల‌కు చెందిన స‌న్నిహితుల సూచ‌న‌ల‌తో వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా చెబుతారు. ఇందులో భాగంగా మొద‌ట శ్రీ‌రెడ్డికి కొన్ని ఛాన‌ల్స్ పెద్ద‌పీట వేయ‌టాన్ని త‌గ్గించుకున్నాయి.

ప్ర‌పంచంలో ఎన్నో స‌మస్య‌లు ఉంటే.. క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అన్నేసి వారాల పాటు గంట‌ల కొద్దీ చ‌ర్చ‌లు.. అవి కాస్తా.. కొంద‌రిని టార్గెట్ చేసేలా ఉండ‌టంపైనా ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఆ త‌ర్వాత నుంచి సోష‌ల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు ద‌ర్శ‌న‌మిస్తున్న శ్రీ‌రెడ్డి.. మీడియాలో పెద్ద‌గా క‌నిపించ‌టం లేదు. తాజాగా ఆమె మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు.

సినీన‌టి.. ద‌ర్శ‌కురాలు జీవితారాజ‌శేఖ‌ర్.. హేతుబాది బాబు గోగినేనితో స‌హా ప‌లువురు సినీన‌టులు.. ఆర్టిస్టులు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్.. సోష‌ల్ మీడియాల‌పై మొత్తం 28 మంది మీద శ్రీ‌రెడ్డి పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఆదివారం ఆసిఫ్ న‌గ‌ర్ ఏసీపీ అశోక్ చ‌క్ర‌వ‌ర్తికి ఫిర్యాదు చేశారు. త‌న‌పై ఇప్ప‌టికి సోష‌ల్ మీడియాలోనూ.. వాట్సాప్ ల‌లోనూ దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని .. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. సినీ ప్ర‌ముఖుల‌పై ఫిర్యాదు చేయ‌టం ద్వారా శ్రీ‌రెడ్డి మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చార‌ని చెప్పాలి. మ‌రి.. దీనిపై జీవితా రాజ‌శేఖ‌ర్ త‌దిత‌రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు