ఆమె హాలీవుడ్ జర్నీపై పంచ్ ప‌డింది

ఆమె హాలీవుడ్ జర్నీపై పంచ్ ప‌డింది

ఇక్క‌డ చేయాల్సినంత హంగామా చేసి... హాలీవుడ్ చెక్కేసింది ప్రియాంక చోప్రా. చాలామంది బాలీవుడ్ భామ‌ల్లా ఒక‌టి రెండు సినిమాల త‌ర్వాత గోడ‌కు కొట్టిన బంతిలా తిరిగొచ్చేస్తుంది లే... అనుకుంటే అక్క‌డే అతుక్కుపోయి హాలీవుడ్ స్టార్ గా ఎదిగింది. అయితే రీసెంటుగా పిల్ల‌కి పెద్ద పంచ్ ప‌డింది. ఆమె ప్ర‌తిష్టాత్మికంగా భావించి చేస్తున్న‌ ‘క్వాంటీనో’ టీవీ సిరీస్ త్వ‌ర‌లో ర‌ద్దు కాబోతుంద‌ట‌.

ప్ర‌స్తుతం క్వాంటీనో సిరియ‌ల్ మూడో సీజ‌న్ న‌డుస్తోంది. సీరియ‌ల్ అన‌గానే ఇక్క‌డిలా అక్క‌డ వేల‌కి వేల ఎపిసోడ్లు సాగ‌వు. మూడో సీజ‌న్ మొత్తం క‌లిపి 13 ఎపిసోడ్లే. అయితే రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి. దాంతో త్వ‌ర‌గానే మేలుకొన్న ఏబీసీ గ్రూప్‌... మూడు ఎపిసోడ్ల‌ను ర‌ద్దు చేసి ప‌ది ఎపిసోడ్ల‌కి కుదించింది. ఇవి పూర్తి కాగానే ఈ సీరియ‌ల్ ఆగిపోనుంది. నిజానికి రేటింగ్స్ ఎక్కువుంటే నాలుగో సీజ‌న్ కూడా తీయాల‌ని భావించింది ఏబీసీ గ్రూప్‌. అందుకు సంబంధించి ప్రియాంక‌తో అగ్రిమెంట్ కూడా రాసుకుంది. కానీ మూడో సీజ‌న్లోనే టీఆర్పీ ప‌డిపోవ‌డంతో నాలుగో సీజ‌న్ ఆలోచ‌న విర‌మించుకుంది.

ఈ సీరియ‌ల్ ప్ర‌చారం కోసం కిటికీల డ్రెస్సు వేసుకుని తెగ ప్ర‌చారం చేసింది ప్రియాంక చోప్రా. ఆ కిటికీల డ్రెస్సు పుణ్య‌మాని ఈమె ఇంగ్లీషు ఇంట‌ర్వ్యూ కూడా పాపుల‌ర్ అయ్యింది. ఆ ఇంట‌ర్వ్యూలో నాలుగో సీజ‌న్ కోసం ప్రిపేర్ అవుతున్నా అని చెప్పింది ప్రియాంక‌. ఇప్పుడు అది కాస్తా ర‌ద్ద‌వ్వ‌డంతో నాలుగో సీజ‌న్ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న ప్రియాంక ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లిన‌ట్ట‌య్యింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు